
కీర్తనలు 97
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 97 తుఫాను, అగ్ని, మెరుపు, పర్వతాల ద్వారా సర్వాధికార పాలనను చిత్రిస్తుంది, విగ్రహాలను, తప్పుడు ఆరాధనను అణచివేస్తుంది. న్యాయం, నీతి ఈ పాలనకు మద్దతు ఇస్తాయి, వెలుగు, సంతోషం విశ్వసనీయ హృదయాల కోసం విత్తబడతాయి.
సర్వాధికారంన్యాయంవిగ్రహాలుసంతోషం
1యెహోవా పరిపాలిస్తారు, భూతలం ఆనందిస్తుంది; ద్వీపాలు, సముద్ర తీర ప్రదేశాలు సంతోషిస్తాయి.
2ఆయన చుట్టూరా మోఘాలు సాంద్రమైన చీకటితో ఆవరించి ఉన్నాయి; ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు పునాదులు.
3ఆయన ఎదుట నుండి మంటలు బయలుదేరి చుట్టూరా చేరి ఉన్న శత్రువులను దహించి వేస్తాయి.
4ఆయన మెరుపులు లోకాన్ని వెలుగిస్తాయి; అది చూసి భూమి కంపిస్తుంది.
5యెహోవా సమక్షంలో పర్వతాలు మైనంలా కరిగిపోతాయి, ఆయన సర్వప్రపంచానికీ ప్రభువు.
6ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తాయి, ప్రజలంతా ఆయన మహిమను చూస్తారు.
7వ్యర్థ విగ్రహాలనుబట్టి గొప్పలు చెప్తూ, చెక్కిన ప్రతిమలను పూజించేవారందరు సిగ్గుపడతారు సకల దేవుళ్ళారా, యెహోవా ఎదుట సాగిలపడండి!
8యెహోవా! మీ తీర్పులను బట్టి సీయోను విని సంతోషిస్తూ ఉంది యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారు.
9యెహోవా, భూమి అంతటికి పైగా ఉన్నావు; దేవుళ్ళందరి పైన మీరు మహోన్నతులు.
10యెహోవాను ప్రేమించేవారు కీడును ద్వేషించుదురు గాక, ఎందుకంటే తన నమ్మకమైన వారి జీవితాలను ఆయన కావలి కాస్తారు దుష్టుల చేతి నుండి ఆయన విడిపిస్తారు.
11నీతిమంతుల మీద వెలుగు యథార్థవంతుల మీద ఆనందం ప్రకాశిస్తాయి.
12నీతిమంతులారా, యెహోవాయందు ఆనందించండి, ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పుకోండి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.