Priests sound trumpets as crowds, waves, hills, and distant nations converge joyfully near Jerusalem

కీర్తనలు 98

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
జాతుల మధ్య బహిరంగంగా వెల్లడైన అద్భుతమైన విజయాన్ని కీర్తన 98 కొనియాడుతుంది. తంతివాద్యాలు, బూరలు, సముద్రాలు, నదులు, పర్వతాలు లోకాన్ని నిష్పక్షపాతంగా తీర్పు తీర్చే న్యాయమైన పాలకుడిని స్వాగతిస్తూ ఒకే సంతోషకరమైన బృందగానంగా మారతాయి.
కొత్త గీతంవిజయంసృష్టిన్యాయం
1యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు; ఆయన కుడిచేయి ఆయన పవిత్రమైన బాహువు విజయాన్ని కలిగిస్తాయి.
2యెహోవా రక్షణను వెల్లడించారు. దేశాల ఎదుట తన నీతిని వెల్లడించారు.
3ఇశ్రాయేలుకు తన ప్రేమను నమ్మకత్వాన్ని చూపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు; మన దేవుని రక్షణ భూమ్యంతాల వరకు కనపడింది.
4భూ సమస్తమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయి, సంగీతంతో ఉత్సాహ గానం చేయి;
5వీణతో యెహోవాకు సంగీత నాదం చేయి, వీణతో, గాన ధ్వనితో,
6బూరలు, పొట్టేలు కొమ్ము ఊదుతూ, రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చేయి.
7సముద్రం, అందులో ఉన్నదంతా, లోకం, అందులో జీవించేవారంతా ప్రతిధ్వని చేయును గాక.
8యెహోవా సన్నిధిలో నదులు చప్పట్లు కొడతాయి. పర్వతాలు ఆనందంగా పాడతాయి.
9యెహోవా లోకానికి తీర్పరిగా, రాజుగా రాబోతున్నారు. ఆయన పరిపాలన ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనవి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.