
కీర్తనలు 9
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 9 న్యాయమైన తీర్పుపై నమ్మకంతో పూర్ణ హృదయ స్తుతిని కలుపుతుంది. అణచివేయబడినవారు సురక్షిత ఆశ్రయం కనుగొంటారు, మరచిపోయిన ప్రజలు గుర్తుచేసుకోబడతారు, గర్విష్ఠ శక్తికి దాని పెళుసైన మానవ పరిమితులు గుర్తుచేయబడతాయి.
కృతజ్ఞతన్యాయంఅణచివేయబడినవారుఆశ్రయం
1యెహోవా, నేను నా హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తాను; మీ అద్భుతమైన క్రియల గురించి నేను చెప్తాను.
2మీలో నేను ఆనందించి సంతోషిస్తాను; ఓ మహోన్నతుడా, మీ నామాన్ని బట్టి నేను స్తుతులు పాడతాను.
3నా శత్రువులు వెనుకకు తిరుగుతారు; మీ ముందు వారు తడబడి నశిస్తారు.
4నీతిమంతుడవైన న్యాయమూర్తిగా సింహాసనంపై కూర్చుని, నా పక్షంగా న్యాయం తీర్చుతున్నారు.
5మీరు దేశాలను మందలించి దుష్టులను నిర్మూలం చేశారు; మీరు వారి పేరును ఎప్పటికీ లేకుండ తుడిచివేశారు.
6అంతులేని పతనం నా శత్రువులు పతనమై పూర్తిగా నశిస్తారు, మీరు వారి పట్టణాలను పెల్లగించారు; వాటి జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది.
7యెహోవా నిరంతరం పరిపాలిస్తారు; తీర్పు కోసం ఆయన తన సింహాసనాన్ని స్థాపించారు.
8ఆయన నీతితో లోకాన్ని పరిపాలిస్తారు ఆయన దేశాలను న్యాయంగా తీర్పు తీరుస్తారు.
9అణచివేయబడిన వారికి యెహోవా ఆశ్రయం, కష్ట సమయాల్లో బలమైన కోట.
10మీ నామం తెలిసిన వారు మీమీద నమ్మకం ఉంచుతారు, ఎందుకంటే యెహోవా, మిమ్మల్ని వెదికే వారిని మీరు ఎన్నడూ విడువరు.
11సీయోనులో సింహాసనాసీనుడైయున్న యెహోవాను గురించి స్తుతులు పాడండి; దేశాల మధ్య ఆయన చేసిన వాటిని ప్రకటించండి.
12ఎందుకంటే రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు జ్ఞాపకముంచుకుంటాడు; బాధితుల మొరను ఆయన విస్మరించరు.
13యెహోవా, నా శత్రువులు నన్ను ఎలా హింసించారో చూడండి! నన్ను కరుణించి మరణ ద్వారాల నుండి నన్ను తప్పించండి,
14తద్వార నేను మీ స్తుతులను సీయోను కుమారీ ద్వారాల దగ్గర ప్రకటిస్తాను, మీ రక్షణలో నేనానందిస్తాను.
15తాము త్రవ్విన గోతిలోనే దేశాలు పడిపోయాయి; తాము పన్నిన వలలోనే వారి పాదాలు చిక్కుకున్నాయి.
16తన న్యాయమైన క్రియల ద్వార యెహోవా బయలుపరచబడతారు; దుష్టులు తాము చేసిన దానిలోనే చిక్కుకుంటారు. సెలా
17దుష్టులు పాతాళంలో పడిపోతారు, దేవున్ని మరచిపోయే దేశాలు కూడా అంతే.
18కాని అవసరతలో ఉన్నవారిని దేవుడు ఎన్నడూ మరచిపోరు; బాధితుల నిరీక్షణ ఎప్పటికీ నశించదు.
19యెహోవా, లెండి, మనుష్యులను గెలువనీయకండి; మీ సమక్షంలో రాజ్యాలకు తీర్పు తీర్చండి.
20యెహోవా, వారిని భయభ్రాంతులకు గురి చేయండి; తాము కేవలం మానవమాత్రులే అని దేశాలను తెలుసుకోనివ్వండి. సెలా
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.