An ancient family with children and sheep gazes across a moonlit world full of creatures

కీర్తనలు 8

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 8 శిశువుల స్తుతి నుండి చంద్రుడు, నక్షత్రాల వరకు చూసి, చిన్న మనుషులు గౌరవం, బాధ్యతను పొందుతారని ఆశ్చర్యపోతుంది. విశాల సృష్టి క్రమంలో మానవాళికి శ్రద్ధగల సంరక్షణ అప్పగించబడుతుంది.
సృష్టిమానవ గౌరవంఆశ్చర్యంకారియస్తత్వం
1యెహోవా, మా ప్రభువా, భూలోకమంతట మీ నామం ఎంతో ప్రభావవంతమైనది! మీరు ఆకాశాల్లో మీ మహిమను ఉంచారు.
2చిన్నపిల్లల చంటిబిడ్డల స్తుతుల ద్వారా, మీ శత్రువుల పగవారి నోరు మూయించడానికి మీ శత్రువులకు వ్యతిరేకంగా మీరు బలమైన కోటను స్థాపించారు.
3మీ చేతి పనియైన మీ ఆకాశాలను, మీరు వాటి వాటి స్థానాల్లో ఉంచిన చంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు,
4మీరు మానవులను జ్ఞాపకం చేసుకోడానికి వారు ఏపాటివారు? మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు?
5మీరు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశారు, మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు.
6మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు; మీరు సమస్తాన్ని అనగా:
7గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి జంతువులను, ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను, సముద్ర మార్గంలో తిరిగే ప్రాణులను వారి పాదాల క్రింద ఉంచారు.
9యెహోవా, మా ప్రభువా, భూమి అంతట మీ నామం ఎంతో ఘనమైనది!

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.