
కీర్తనలు 87
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
సీయోనును ఆశ్చర్యకరంగా దూరం చేరుకునే పౌరసత్వం గల ప్రియమైన పునాదిగా కీర్తన 87 కొనియాడుతుంది. మునుపటి బయటివారు, దూర జాతులు స్వదేశీయులుగా లెక్కించబడతారు, గాయకులు, నృత్యకారులు నగరాన్ని పంచుకున్న మూలంగా జరుపుకుంటారు.
సీయోనుజాతులుచెందికవేడుక
1యెహోవా తన పట్టణాన్ని పరిశుద్ధ పర్వతంపై స్థాపించారు.
2యాకోబు ఇతర నివాసాలన్నిటికంటె యెహోవా సీయోను గుమ్మాలను ఎక్కువగా ప్రేమిస్తారు.
3దేవుని పట్టణమా, నీ గురించి గొప్ప విషయాలు చెప్పబడ్డాయి. సెలా
4“నేను రాహాబు బబులోనును నన్ను గుర్తించిన వారిగా లెక్కిస్తాను అలాగే ఫిలిష్తియా, తూరు కూషు కూడా, ‘ఇది సీయోనులో పుట్టింది’ ” అని వారంటారు.
5నిజమే, సీయోను గురించి ఇలా అంటారు, “ఇది అది కూడా ఆమెలోనే జన్మించాయి, మహోన్నతుడు తానే సీయోనును స్థాపిస్తారు.”
6యెహోవా పౌరుల పేర్లు నమోదు చేసేటప్పుడు “ఇది సీయోనులో జన్మించింది” అని గుర్తిస్తారు. సెలా
7వారు వాయిద్యాలు వాయిస్తుండగా, “నా ఊటలన్నీ మీలోనే ఉన్నాయి” అని వారు పాడతారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.