An elder advocates for poor families and children before wealthy, indifferent judges in an ancient court

కీర్తనలు 82

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
బలహీనులు, అనాథలు, పేదలు, అణచివేయబడినవారు దుర్బలంగా మిగిలి ఉండగా దుష్టులకు అనుకూలంగా ఉండే పాలకులను కీర్తన 82 నిందిస్తుంది. వారి అన్యాయం సమాజ పునాదులను కదిలిస్తుంది, నిజమైన న్యాయాధిపతి సరైన క్రమాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తికి దారితీస్తుంది.
న్యాయంబలహీనులుతీర్పునాయకత్వం
1దేవుడు గొప్ప సభలో నిలబడి ఉన్నారు; ఆయన దైవముల మధ్య తీర్పు ఇస్తారు:
2“మీరు ఎంతకాలం అన్యాయాలను సమర్థిస్తారు దుష్టులకు పక్షపాతం చూపిస్తారు? సెలా
3బలహీనులు, తండ్రిలేనివారి పక్షం వహించండి; పేదలకు అణచివేయబడిన వారికి న్యాయం చేయండి.
4బలహీనులను అవసరతలో ఉన్నవారిని కాపాడండి; దుష్టుల చేతి నుండి వారిని విడిపించండి.
5“వారికి ఏమి తెలియదు, వారు ఏమి గ్రహించరు. వారు చీకటిలో తిరుగుతారు; భూమి పునాదులు కదిలిపోయాయి.
6“ ‘మీరు “దేవుళ్ళు”; మీరంతా మహోన్నతుని కుమారులు.’
7అయితే మీరు ఇతర మనుష్యుల్లా చస్తారు; ఇతర పాలకుల్లా మీరు కూలిపోతారు, అని నేనన్నాను.”
8ఓ దేవా, లేవండి, భూమికి తీర్పు తీర్చండి, ఎందుకంటే అన్ని దేశాలు మీ వారసత్వంగా ఉన్నాయి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.