A wilderness traveler reaches for water while remembering sanctuary worship and resting safely by night

కీర్తనలు 63

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 63 పొడి అరణ్యంలో శారీరక దాహాన్ని దేవుని కోసం తీవ్రమైన ఆరాటంగా మారుస్తుంది. గుర్తుచేసుకున్న పవిత్ర స్థల మహిమ, అర్ధరాత్రి ధ్యానం, ఆశ్రయపు సంరక్షణ సమృద్ధి కంటే లోతుగా ఆరాధకుడిని తృప్తిపరచి సంతోషకరమైన స్తుతిని మేల్కొల్పుతాయి.
ఆరాటంఆరాధనతృప్తిరక్షణ
1దేవా, మీరు నా దేవుడు, నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను; నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో, నేను మీ కోసం దప్పిగొన్నాను, నా శరీరమంతా మీ కోసం ఆశపడుతుంది.
2పరిశుద్ధాలయంలో నేను మిమ్మల్ని చూశాను. మీ ఘనతా మహిమను తేరి చూశాను
3మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి.
4నా జీవితకాలమంతా నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీ పేరును బట్టి నా చేతులు ఎత్తుతాను.
5శ్రేష్ఠమైన ఆహారం దొరికినట్లు నేను సంతృప్తి పొందుతాను; సంతోషించే పెదవులతో నా నోరు మిమ్మల్ని స్తుతిస్తుంది.
6పడక మీద నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను; రాత్రి జాముల్లో నేను మీ గురించి ఆలోచిస్తాను.
7మీరు నాకు సహాయం కాబట్టి మీ రెక్కల నీడలో నేను ఆనందంతో పాడతాను.
8నేను మీకు అంటిపెట్టుకుని ఉంటాను; మీ కుడిచేయి నన్ను ఆదుకుంటుంది.
9నన్ను ఎవరు చంపాలని చూస్తారో వారే నాశనం అవుతారు; వారు భూమి అగాధ స్థలాలకు దిగిపోతారు.
10వారు ఖడ్గానికి అప్పగించబడి నక్కలకు ఆహారం అవుతారు.
11కాని రాజు దేవునియందే ఆనందిస్తాడు; దేవుని మీద ప్రమాణం చేసే వారందరు ఆయనయందు అతిశయిస్తారు. కాని అబద్ధికుల నోళ్ళు మౌనంగా ఉంటాయి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.