
కీర్తనలు 64
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
బాణాల్లా పదునుపెట్టిన రహస్య కుట్రలు, క్రూర మాటల నుండి రక్షణ కోసం కీర్తన 64 అడుగుతుంది. దుష్టులు తమ ఉరులు కనిపించవని అనుకుంటారు, కానీ న్యాయం వచ్చినప్పుడు వారి సొంత మాటలే వారిని బయటపెడతాయి, నీతిమంతులను సంతోషించి ఆశ్రయం పొందేలా చేస్తాయి.
రక్షణన్యాయంకుట్రఆశ్రయం
1నా దేవా, నా ఫిర్యాదు వినండి; శత్రువు భయం నుండి నా జీవితాన్ని కాపాడండి.
2దుష్టుల కుట్ర నుండి, కీడుచేసేవారి పన్నాగాల నుండి నన్ను దాచండి.
3వారు తమ నాలుకలను ఖడ్గాల్లా పదునుపెడతారు మరణకరమైన బాణాల వంటి క్రూరమైన పదాలను లక్ష్యంగా చేసుకుంటారు.
4చాటున ఉండి నిర్దోషుల మీదికి బాణాలు విసురుతారు. వారు భయం లేకుండా, అకస్మాత్తుగా బాణాలు విసురుతారు.
5కీడు తలపెట్టడంలో వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు. వారు తమ వలలను దాచడం గురించి మాట్లాడతారు; వారంటారు, “దీన్ని ఎవరు చూస్తారు?”
6వారు అన్యాయాలను రూపొందించి అంటారు, “మేము ఒక సంపూర్ణ ప్రణాళికను రూపొందించాము!” నిశ్చయంగా మానవుల మనస్సు హృదయం మోసపూరితమైనవి.
7కాని, దేవుడు తన బాణాలను వాళ్ళ మీదికి విసురుతారు; వారు అకస్మాత్తుగా కొట్టబడతారు.
8ఆయన వారి సొంత నాలుకలను వారికే వ్యతిరేకంగా మార్చి వారిని పతనానికి తెస్తారు; వారిని చూసేవారందరూ ఎగతాళిగా తలాడిస్తారు.
9మనుష్యులందరు భయపడతారు; దేవుడు చేసిన క్రియలను వారు ప్రకటిస్తారు ఆయన చేసిన దానిని గ్రహిస్తారు.
10నీతిమంతులు యెహోవాయందు ఆనందించుదురు గాక. ఆయననే ఆశ్రయించెదరు గాక. యథార్థ హృదయులను ఆయన ఘనపరచుదురు గాక!
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.