
కీర్తనలు 58
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
అన్యాయాన్ని తయారుచేసి సరిదిద్దడానికి చెవిటిగా ఉండే పాలకులను కీర్తన 58 ఖండిస్తుంది. దాని తీవ్రమైన కవితా చిత్రాలు లోతుగా పాతుకుపోయిన హానికి ముగింపును డిమాండ్ చేస్తాయి, తద్వారా సమాజాలు నీతియుక్త తీర్పు నిజంగా ముఖ్యమని చూడగలవు.
న్యాయంఅవినీతి పాలకులుతీర్పుసమాజం
1పాలకులారా, నిజంగా మీరు న్యాయంగా మాట్లాడతారా? మీరు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తారా?
2లేదు, మీ హృదయంలో అన్యాయం చేస్తున్నారు, దేశంలో హింసను పెంచుతున్నారు.
3ఈ దుష్టులు పుట్టుకతోనే దారి తప్పినవారు; గర్భం నుండే వారు అబద్ధాలాడుతారు.
4వారి విషం భయంకరమైన పాముల విషం లాంటిది చెవులు మూసుకున్న నాగుపాములా వారున్నారు
5పాములు ఆడించేవారు ఎంత నైపుణ్యంగా వాయించినా ఆ సంగీతాన్ని వినని పాముల్లా వారున్నారు.
6దేవా! వారి నోటి పళ్ళు విరగ్గొట్టండి; యెహోవా! ఈ కొదమ సింహాల కోరలను ఊడదీయండి.
7ప్రవహించే నీటిలా వారు మాయమవుదురు గాక; వారు విల్లు ఎక్కుపెట్టినప్పుడు వారి బాణాలు గురిని చేరకుండును గాక.
8వారు నడుస్తూ కరిగి నశించిపోయే నత్తల్లా వారుంటారు. గర్భస్రావమై వెలుగు చూడని పిండంలా వారవుతారు.
9మీ కుండలకు ముండ్లకంపల సెగ తగలకముందే, పచ్చివైనా ఎండినవైనా అంటే చిన్నా పెద్దా తేడా లేకుండ దుష్టులు తుడిచివేయబడతారు.
10ప్రతీకారం జరిగినప్పుడు నీతిమంతులు సంతోషిస్తారు, దుష్టుల రక్తంలో వారు కాళ్లు కడుక్కుంటారు.
11తర్వాత ప్రజలు అది చూసి, “నీతిమంతులకు తప్పక బహుమానం ఉంటుంది; ఖచ్చితంగా ఈ లోకంలో తీర్పు తీర్చే దేవుడు ఉన్నారు” అంటారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.