Fugitives rest beneath nesting birds as a musician tunes his harp and enemies struggle in their net

కీర్తనలు 57

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ప్రమాదం గడిచిపోయేంత వరకు, వేటాడేవారు ఉరులు సిద్ధం చేస్తుండగా కీర్తన 57 రెక్కల కింద ఆశ్రయం కోసం వెతుకుతుంది. స్థిరమైన హృదయం వీణ, తంతివాద్యం, తెల్లవారుజామునే మేల్కొల్పి, ప్రైవేటు గుహ ప్రార్థనను జాతుల మధ్య స్తుతిగా విస్తరిస్తుంది.
ఆశ్రయంస్థిరమైన హృదయంస్తుతిదయ
1నా దేవా, నన్ను కరుణించండి, నన్ను కరుణించండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశ్రయించాను. విపత్తు గడిచేవరకు నేను మీ రెక్కల నీడలో ఆశ్రయం పొందుతాను.
2నా కార్యం సఫలపరచే, మహోన్నతుడైన దేవునికి మొరపెట్టుకుంటాను.
3పరలోకం నుండి సాయం పంపి నన్ను విడిపిస్తారు, నన్ను దిగమ్రింగాలని చూస్తూ నా మీద చాడీలు పలికే వారి బారి నుండి నన్ను తప్పిస్తారు. సెలా దేవుడు తన మారని ప్రేమను, నమ్మకత్వాన్ని పంపుతారు.
4నేను సింహాల మధ్య ఉన్నాను; నేను క్రూరమైన జంతువుల మధ్య నివసిస్తున్నాను వారు ఈటెలు బాణాల వంటి పళ్ళు కలిగిన మనుష్యులు, వారి నాలుకలు పదునైన కత్తుల వంటివి.
5దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.
6నా పాదాల చుట్టూ వలలు వేశారు, నేను బాధతో క్రుంగి ఉన్నాను నా దారిలో వారు గుంట త్రవ్వారు కాని అందులో వారే పడ్డారు. సెలా
7ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది, నా హృదయం స్థిరంగా ఉంది; నేను పాడతాను సంగీతం వాయిస్తాను,
8నా ప్రాణమా, మేలుకో! సితారా వీణా, మేలుకోండి! ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను.
9ప్రభువా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను.
10ఎందుకంటే మీ మారని ప్రేమ, ఆకాశాలను అంటుతుంది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.
11దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.