
కీర్తనలు 56
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
శత్రువులైన ఫిలిష్తీయుల మధ్య బందీగా ఉన్నప్పుడు కీర్తన 56 మాట్లాడుతుంది, అక్కడ శత్రువులు గమనించి మాటలను వక్రీకరిస్తారు. భయం నిరాకరించబడకుండా అంగీకరించబడుతుంది, కన్నీళ్లు గుర్తుంచుకోబడతాయి, నమ్మకం మానవ బెదిరింపులు చివరికి గెలవలేవనే నిశ్చయతగా పెరుగుతుంది.
భయంనమ్మకంకన్నీళ్లువిడుదల
1నా దేవా! నాపై దయ చూపండి, ఎందుకంటే నా శత్రువులు వేగంగా వెంటాడుతున్నారు; రోజంతా వారు తమ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు.
2నా విరోధులు రోజంతా నన్ను వెంటాడుతున్నారు; వారి అహంకారంలో అనేకులు నా మీద దాడి చేస్తున్నారు.
3నాకు భయం వేసినప్పుడు, నేను మీయందు నమ్మకం ఉంచుతాను.
4దేవునిలో ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను దేవునిలో నేను నమ్ముతాను భయపడను. మానవమాత్రులు నన్నేమి చేయగలరు?
5రోజంతా వారు నా మాటలను వక్రీకరిస్తారు; వారి పథకాలన్నీ నా పతనం కొరకే.
6నా ప్రాణం తీయాలనే ఆశతో వారు కుట్ర చేస్తారు, పొంచి ఉంటారు, నా కదలికలు గమనిస్తారు.
7వారి దుష్టత్వాన్ని బట్టి వారు తప్పించుకోనివ్వకండి; దేవా, మీ కోపంలో వారి దేశాలను కూలద్రోయండి.
8నా బాధలను లెక్కించండి; నా కన్నీటిని మీ తిత్తిలో నింపండి అవి మీ గ్రంథంలో వ్రాయబడలేదా?
9నేను మీకు మొరపెట్టినప్పుడు నా శత్రువులు వెనుకకు తగ్గుతారు. దాన్ని బట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నేను తెలుసుకుంటాను.
10దేవునిలో, ఆయన వాగ్దానాన్ని స్తుతిస్తాను, అవును, యెహోవాయందు, ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను.
11నేను దేవునిలో నమ్ముకున్నాను నేను భయపడను. మనుష్యులు నన్నేమి చేయగలరు?
12నా దేవా, నేను మీకు మ్రొక్కుబడులను చెల్లించాల్సి ఉంది; నా కృతజ్ఞత అర్పణలను మీకు చెల్లిస్తాను.
13ఎందుకంటే మీరు మరణం నుండి నన్ను విడిపించారు తొట్రిల్లకుండ నా పాదాలను దేవుని ఎదుట నేను జీవపువెలుగులో నడవడానికి శక్తినిచ్చారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.