Corrupt leaders feast at a city gate while humble families share bread and look toward Zion

కీర్తనలు 53

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 53 అవినీతి ప్రవర్తన, విశ్వవ్యాప్త వైఫల్యం, బలహీన ప్రజల దోపిడీ ద్వారా ఆచరణాత్మక నాస్తికత్వాన్ని వివరిస్తుంది. అయినప్పటికీ భయాందోళన అన్యాయ శక్తిని ముంచెత్తుతుంది, బాధపడుతున్న సమాజం సీయోను నుండి వచ్చే పునరుద్ధరణ కోసం కొనసాగుతూ ఆరాటపడుతుంది.
మూర్ఖత్వంఅవినీతిపేదలుపునరుద్ధరణ
1“దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. వారు అవినీతిపరులు, వారి మార్గాలు నీచమైనవి; మంచి చేసేవారు ఒక్కరు లేరు.
2అర్థం చేసుకునేవారు, దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు పరలోకం నుండి మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు
3ప్రతిఒక్కరు దారి తప్పి చెడిపోయారు; మంచి చేసేవారు ఎవరూ లేరు ఒక్కరు కూడా లేరు.
4కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; వారు ఎన్నడు దేవునికి మొరపెట్టరు.
5అయితే భయపడడానికి ఏమిలేని దగ్గర, వారు, భయంతో మునిగిపోయి ఉన్నారు. మీమీద దాడి చేసిన వారి ఎముకలను దేవుడు చెదరగొట్టారు; దేవుడు వారిని తృణీకరించారు, కాబట్టి మీరు వారిని సిగ్గుపడేలా చేశారు.
6సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది! దేవుడు తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు, యాకోబు సంతోషించును గాక! ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.