
కీర్తనలు 52
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 52 హాని, మోసం, దొంగిలించిన భద్రతలో గొప్పలు చెప్పుకునే శక్తివంతమైన సమాచారదారుడిని ఎదుర్కొంటుంది. వినాశకర మాటలు నిలవవు, విశ్వసనీయ వ్యక్తి స్థిరమైన నమ్మకం, కృతజ్ఞతాపూర్వక బహిరంగ సాక్ష్యం ద్వారా ఒలీవ చెట్టులా వృద్ధి చెందుతాడు.
మోసంనమ్మకంతీర్పుకృతజ్ఞత
1బలాఢ్యుడా, చేసిన కీడు గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు? దేవుని దృష్టిలో అవమానకరమైన నీవు, రోజంతా ఎందుకు ప్రగల్భాలు పలుకుతావు?
2మోసం చేసేవాడా, నీ నాలుక పదునైన క్షౌరం చేసే కత్తి; అది నాశనాన్ని చేస్తుంది.
3మేలు కంటే కీడు చేయడం, నీతి కంటే అబద్ధం చెప్పడమే నీకు ఇష్టం. సెలా
4మోసపూరితమైన నాలుక గలవాడా, నీకు హానికరమైన మాటలే ఇష్టం.
5ఖచ్చితంగా దేవుడు నిన్ను నిత్యనాశనానికి గురి చేస్తారు: ఆయన నిన్ను మీ గుడారంలో నుండి పెరికివేస్తారు; సజీవుల దేశంలో నుండి నిన్ను పెరికివేస్తారు. సెలా
6నీతిమంతులు ఇదంతా చూసి భయభక్తులతో వారు నవ్వుతూ ఇలా అంటారు,
7“ఇతన్ని చూడండి, దేవున్ని తన బలమైన కోటగా చేసుకోకుండ తనకున్న సంపదలను నమ్ముకుని ఇతరులను నాశనం చేస్తూ బలపడ్డాడు!”
8కానీ నేను దేవుని నివాసంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాను; నేను ఎల్లప్పుడు, మారని దేవుని ప్రేమను నమ్ముతాను.
9మీరు చేసిందానికి నేను ఎల్లప్పుడు మీ భక్తుల ఎదుట మిమ్మల్ని స్తుతిస్తాను. మీ నామం ఉత్తమమైనది, కాబట్టి నేను మీ నామంలో నిరీక్షణ కలిగి ఉన్నాను.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.