
కీర్తనలు 51
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 51 సాకు చెప్పకుండా తీవ్రమైన తప్పిదానికి నేరుగా ఒప్పుకోలుతో స్పందిస్తుంది. కీర్తనకారుడు శుద్ధి, నూతనీకరించిన అంతర్గత విధేయత, పునరుద్ధరించిన సంతోషం, ఉపయోగకరమైన సాక్ష్యం కోసం వెతుకుతూ, నిజాయితీ పశ్చాత్తాపం ప్రదర్శనాత్మక బలి కంటే ముఖ్యమని గుర్తిస్తాడు.
ఒప్పుకోలుదయశుద్ధినూతనీకరణ
1ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి నన్ను కరుణించండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి, నా పాపాలను తుడిచివేయండి.
2నా దోషాలన్నింటిని కడిగి, నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి.
3నా అతిక్రమాలు నాకు తెలుసు నా పాపం ఎల్లప్పుడు నా కళ్లెదుటే ఉంది.
4కేవలం మీకు, మీకే విరోధంగా నేను పాపం చేశాను, మీ దృష్టికి చెడు చేశాను; మీ తీర్పులో మీరు సరిగ్గా ఉంటారు మీరు తీర్పు తీర్చునప్పుడు న్యాయసమ్మతంగా ఉంటుంది.
5నేను పాపిగా పుట్టాను, నా తల్లి నన్ను గర్భం దాల్చినప్పుడు నేను పాపిని.
6మీరు అంతరంగంలో నిజాయితీ కోరతారు; ఆ రహస్య ప్రదేశంలో మీరు నాకు జ్ఞానం బోధించారు.
7హిస్సోపుతో నన్ను శుద్ధీకరించండి, నేను శుద్ధునిగా ఉంటాను; నన్ను కడగండి, నేను హిమము కంటే తెల్లగా ఉంటాను.
8నన్ను ఆనందాన్ని సంతోషాన్ని విననివ్వండి; మీరు విరిచిన ఎముకలను సంతోషించనివ్వండి.
9నా పాపముల నుండి మీ ముఖాన్ని దాచండి నా దోషమంతటిని తుడిచివేయండి.
10ఓ దేవా, నాలో శుద్ధహృదయాన్ని సృష్టించండి, నాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టించండి.
11మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి, మీ పరిశుద్ధాత్మను నా నుండి తొలగించకండి.
12మీ రక్షణానందం నాకు తిరిగి చేకూర్చండి, నన్ను సంరక్షించడానికి నాకు సమ్మతిగల ఆత్మను ఇవ్వండి.
13అప్పుడు అతిక్రమం చేసేవారికి మీ మార్గాలను బోధిస్తాను, తద్వార పాపులు మీ దగ్గరకు తిరిగి వస్తారు.
14మీరు దేవుడు, నా రక్షకుడు, ఓ దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించండి, నా నాలుక మీ నీతిని గురించి పాడుతుంది.
15ప్రభువా, నా పెదవులను తెరవండి, నా నోరు మీ స్తుతిని ప్రకటిస్తుంది.
16మీరు బలులను బట్టి ఆనందించరు, లేకపోతే నేను తెచ్చేవాన్ని; మీరు దహనబలులను ఇష్టపడరు.
17విరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి; పశ్చాత్తాపంతో విరిగిన హృదయాన్ని దేవా, మీరు నిరాకరించరు.
18మీ దయతో సీయోనుకు మంచి చేయండి; యెరూషలేము గోడలు కట్టించండి.
19అప్పుడు మీరు నీతిమంతుల బలులలో, దహన బలులలో, సర్వాంగ హోమములలో ఆనందిస్తారు; అప్పుడు మీ బలిపీఠం మీద ఎద్దులు అర్పించబడతాయి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.