
కీర్తనలు 54
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
అపరిచితులు దావీదు ఉనికిని శత్రు శక్తికి ద్రోహం చేసినప్పుడు కీర్తన 54 తలెత్తుతుంది. సంక్షిప్త ప్రార్థన నిర్దోషిత్వం, రక్షణ కోసం అడిగి, విశ్వసనీయ సహచరుల ద్వారా నిలబెట్టే సహాయాన్ని గుర్తించి, విడుదల తరువాత ఇష్టపూర్వక కృతజ్ఞతను వాగ్దానం చేస్తుంది.
ద్రోహంసహాయంవిడుదలకృతజ్ఞత
1ఓ దేవా, మీ నామమును బట్టి నన్ను రక్షించండి; మీ బలాన్నిబట్టి శిక్షా విముక్తిని చేయండి.
2ఓ దేవా! నా ప్రార్థన వినండి; నా నోటి మాటలను ఆలకించండి.
3అపరిచితులు నాపై దాడి చేస్తున్నారు; దయలేని మనుష్యులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు వారు దేవుడంటే గౌరవం లేని మనుష్యులు. సెలా
4ఖచ్చితంగా దేవుడే నాకు సహాయం; ప్రభువే నన్ను సంరక్షించేవారు.
5నన్ను దూషించే వారు భయంతో వెనుకకు మరలి వెళ్లిపోవాలి; మీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నిర్మూలం చేయండి.
6యెహోవా, నేను మీకు స్వేచ్ఛార్పణలు అర్పిస్తాను; మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే అది మంచిది.
7మీరు ఇబ్బందులన్నిటి నుండి నన్ను విడిపించారు, నా కళ్లు నా శత్రువుల మీదికి విజయోత్సాహంతో చూశాయి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.