
కీర్తనలు 47
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
దేవుడు అన్ని జాతులపై పరిపాలిస్తున్నాడు కాబట్టి ప్రతి ప్రజను చప్పట్లు కొట్టమని, కేక వేయమని, అర్థంతో పాడమని కీర్తన 47 ఆహ్వానిస్తుంది. సింహాసనాధిష్ఠానం ప్రతిమ ఉత్సాహభరిత వేడుకను విశ్వవ్యాప్త సర్వాధికారం, జ్ఞానవంతమైన స్తుతితో కలుపుతుంది.
రాజరికంజాతులుస్తుతిసర్వాధికారం
1సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి; దేవునికి ఆనందంతో కేకలు వేయండి.
2మహోన్నతుడైన యెహోవా భయంకరుడు, భూమి అంతటికి ఆయన గొప్ప రాజు.
3ఆయన దేశాలను మన వశం చేశారు, జనాలను మన పాదాల క్రింద ఉంచారు.
4మన వారసత్వాన్ని మన కోసం ఏర్పాటు చేశారు. అది తాను ప్రేమించిన యాకోబు గర్వకారణము. సెలా
5దేవుడు జయధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు, యెహోవా బూరధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు.
6దేవునికి స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి; మన రాజుకు స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి.
7దేవుడు భూమి అంతటికి రాజు; ఆయనకు స్తుతికీర్తన పాడండి.
8దేవుడు దేశాలను పరిపాలిస్తున్నారు; దేవుడు తన పవిత్ర సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు.
9దేశాల అధిపతులు సమకూడతారు అబ్రాహాము దేవుని ప్రజలుగా సమకూడతారు భూమి మీద డాళ్లు దేవునికి చెందినవి; ఆయన గొప్పగా హెచ్చింపబడ్డారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.