Families rest beside a clear river while mountains churn and abandoned bows lie outside

కీర్తనలు 46

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
భూమి, పర్వతాలు, సముద్రాలు, జాతులు, రాజ్యాలు కంపించినప్పుడు దేవుడు ప్రస్తుత ఆశ్రయమని కీర్తన 46 ప్రకటిస్తుంది. జీవాన్నిచ్చే నది నగరాన్ని స్థిరపరుస్తుంది, యుద్ధం ముగింపుకు తీసుకురాబడుతుంది, భయపడిన ప్రజలు నిశ్చలతలోకి పిలవబడతారు.
ఆశ్రయంశాంతినిశ్చలతకల్లోలం
1దేవుడు మనకు ఆశ్రయం బలం, ఇబ్బందిలో ఎప్పుడు ఉండే సహాయం
2కాబట్టి భూమి మార్పుచెందినా, నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము.
3జలాలు గర్జించినా నురుగు కట్టినా పర్వతాలు వాటి పెరుగుదలతో కదిలినా మేము భయపడము. సెలా
4అది ఒక నది. దాని శాఖలు దేవుని పట్టణాన్ని సంతోషపెడతాయి, అది మహోన్నతుడు నివసించే పరిశుద్ధస్థలము.
5అందులో దేవుడున్నారు, అది కూలదు; తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తారు.
6దేశాలు గందరగోళంలో ఉన్నాయి, రాజ్యాలు కూలిపోతాయి; దేవుని స్వరం ఉరుముతుంది, భూమి కరుగుతుంది.
7సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా
8రండి యెహోవా చేసిన క్రియలను చూడండి, లోకంలో నాశనాన్ని ఆయన ఎలా తెస్తారో చూడండి.
9ఆ కొన నుండి ఈ కొనదాకా భూమి మీద యుద్ధాలు జరగకుండా ఆయనే ఆపివేస్తారు. విల్లును విరుస్తారు, ఈటెను ముక్కలు చేస్తారు; రథాలను అగ్నితో కాల్చేస్తారు.
10“ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి; దేశాల్లో నేను హెచ్చింపబడతాను, భూమి మీద నేను హెచ్చింపబడతాను.”
11సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.