
కీర్తనలు 3
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
పారిపోతూ చుట్టుముట్టబడి, కీర్తనకారుడు ప్రమాదాన్ని, తన కీర్తిని దేవుడికి అప్పగిస్తాడు. రక్షణ డాలుగా మారుతుంది, ప్రార్థన జవాబును పొందుతుంది, ప్రతి వైపు నుండి అపారమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ సురక్షిత నిద్ర నూతన ధైర్యానికి దారితీస్తుంది.
ఆశ్రయంప్రార్థనరక్షణధైర్యం
1యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు! నామీదికి ఎంతోమంది లేస్తారు!
2“దేవుడు అతన్ని విడిపించడు” అని అనేకులు నా గురించి చెప్తున్నారు. సెలా
3కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.
4నేను యెహోవాకు మొరపెడతాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. సెలా
5నేను పడుకుని నిద్రపోతాను; యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను.
6అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను.
7యెహోవా, లెండి! నా దేవా, నన్ను విడిపించండి! నా శత్రువులందరిని దవడపై కొట్టండి; దుష్టుల పళ్ళు విరగ్గొట్టండి.
8రక్షణ యెహోవా నుండి వస్తుంది. మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ఉండును గాక. సెలా
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.