
కీర్తనలు 2
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 2 దేవుని అభిషిక్త రాజు సీయోనుపై సురక్షితంగా నిలబడగా దైవిక పాలనను ప్రతిఘటించే జాతులను చిత్రిస్తుంది. భూలోక శక్తికి దైవిక అధికారం ముందు మూర్ఖమైన ధిక్కారం కంటే జ్ఞానం, వినయపూర్వక సేవ, ఆశ్రయం వైపు హెచ్చరిక ఇవ్వబడుతుంది.
రాజరికంసీయోనుజాతులుఆశ్రయం
1దేశాలు ఎందుకు కుట్ర చేస్తున్నాయి? ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?
2యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచి పాలకులందరు ఒకటిగా చేరి,
3“మనం వారి గొలుసులను తెంపుదాం వారి సంకెళ్ళను విసిరి పారేద్దాం” అంటున్నారు.
4ఆకాశంలో ఆసీనులై ఉన్న ప్రభువు నవ్వుతున్నారు; ఆయన వారిని చూసి ఎగతాళి చేస్తున్నారు.
5ఆయన కోపంతో వారిని గద్దించి తన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు,
6“నా పవిత్ర పర్వతమైన సీయోనును నా రాజు ఏలుతున్నారు.”
7నేను యెహోవా శాసనాన్ని ప్రకటిస్తాను: ఆయన నాతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.
8నన్ను అడిగితే, నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా, భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను.
9ఇనుపదండంతో నీవు వారిని నలగ్గొడతావు; పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.”
10కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి.
11యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి.
12ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.