
కీర్తనలు 4
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 4 బాధ, కోపం, వట్టి అన్వేషణను నిజాయితీ గల సాయంత్రం ప్రార్థనలోకి తీసుకువస్తుంది. కీర్తనకారుడు భౌతిక సమృద్ధి కంటే లోతైన సంతోషాన్ని కనుగొని దేవుని రక్షక సంరక్షణపై స్థిరమైన నమ్మకం ద్వారా సురక్షితంగా పడుకుంటాడు.
సాయంత్రం ప్రార్థననమ్మకంశాంతిసంతోషం
1నీతిమంతుడవైన నా దేవా, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు జవాబు ఇవ్వండి . నా బాధ నుండి నాకు ఉపశమనం ఇవ్వండి; నాపై దయచూపి నా ప్రార్థన వినండి.
2ఓ ప్రజలారా, మీరు ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? మీరు ఎంతకాలం భ్రమలను ప్రేమిస్తూ అబద్ధాలను అనుసరిస్తారు? సెలా
3యెహోవా తన నమ్మకమైన సేవకున్ని తన కోసం ప్రత్యేకించుకున్నారని తెలుసుకోండి; నేను మొరపెట్టినప్పుడు యెహోవా వింటారు.
4వణకండి, పాపం చేయకండి. మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. సెలా
5నీతియుక్తమైన బలులను అర్పించి యెహోవాపై నమ్మకముంచండి.
6యెహోవా, “మాకు అభివృద్ధి ఎవరు తెస్తారు?” అని అనేకులు అడుగుతున్నారు మీ ముఖకాంతిని మామీద ప్రకాశించనీయండి.
7ధాన్యం క్రొత్త ద్రాక్షరసం సమృద్ధిగా గలవారికి ఉండే సంతోషం కన్నా ఎక్కువ సంతోషాన్ని మీరు నా హృదయానికి ఇచ్చారు.
8నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే యెహోవా, మీరు మాత్రమే నన్ను క్షేమంగా నివసించేలా చేస్తారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.