Trumpets, harps, lyres, drums, flutes, cymbals, dancers, families, and animals celebrate at sunrise

కీర్తనలు 150

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కేంద్రీకృత, నిరోధం లేని స్తుతితో కీర్తన 150 కీర్తనల గ్రంథాన్ని పూర్తి చేస్తుంది. పవిత్ర స్థలం, ఆకాశం, మహాకార్యాలు, అపారమైన గొప్పతనం, బూర, తంతివాద్యాలు, లయ, తాళాలు, నృత్యం, ప్రతి శ్వాస తీసుకునే ప్రాణి ఒకే చివరి బృందగానాన్ని రూపొందిస్తాయి.
స్తుతిసంగీతంపవిత్ర స్థలంసృష్టి
1యెహోవాను స్తుతించండి. పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి; ఆయన గొప్ప ఆకాశంలో దేవున్ని స్తుతించండి.
2ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి; ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
3బూర ధ్వనితో ఆయనను స్తుతించండి, సితారా, వీణలతో ఆయనను స్తుతించండి.
4కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి, తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి.
5తాళాలు మ్రోగిస్తూ, గణగణ ధ్వని చేసే తాళాలతో, ఆయనను స్తుతించండి.
6ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.