
కీర్తనలు 149
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కొత్త సామూహిక గీతం, నృత్యం, సంగీతం, వినయస్థుల గౌరవాన్ని కీర్తన 149 కొనియాడుతుంది. అణచివేత శక్తిపై జవాబుదారీ తీర్పు పక్కన స్తుతి నిలబడుతుంది, నియంత్రణలేని వ్యక్తిగత ప్రతీకారం కాకుండా విశ్వసనీయ విజయంగా చిత్రించబడుతుంది.
కొత్త గీతంసంతోషంన్యాయంవిజయం
1యెహోవాను స్తుతించండి. యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఆయన యొక్క నమ్మకమైన ప్రజల సమాజంలో స్తుతి పాడండి.
2ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తలో సంతోషించును గాక; సీయోను ప్రజలు తమ రాజులో ఆనందించుదురు గాక.
3వారు ఆయన నామాన్ని నాట్యం చేస్తూ స్తుతిస్తారు తంబురతో సితారాతో గానం చేస్తారు.
4యెహోవా తన ప్రజల్లో ఆనందిస్తారు; దీనులకు విజయాన్ని కిరీటంగా ధరింపజేస్తారు.
5ఆయన యొక్క నమ్మకమైన ప్రజలు ఈ ఘనతలో సంతోషించుదురు గాక. వారు వారి పడకలో ఆనందంతో పాడుదురు గాక.
6వారి నోళ్ళలో దేవుని స్తుతి వారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉండును గాక.
7దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలను శిక్షించడానికి,
8వారి రాజులను సంకెళ్ళతో, ఉక్కు సంకెళ్ళతో వారి సంస్థానాధిపతులను బంధించడానికి, వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన తీర్పు అమలుచేసేలా ఇది ఉంటుంది, ఆయన యొక్క నమ్మకమైన ప్రజలందరికి ఈ ఘనత ఉంటుంది. యెహోవాను స్తుతించండి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.