A hunted man prays inside a cave as pursuers pass and friends approach along a sunlit path

కీర్తనలు 142

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఒంటరితనం, ప్రమాదం, స్పష్టమైన విడనాడటం నుండి కీర్తన 142 నిజాయితీ ఫిర్యాదును కుమ్మరిస్తుంది. కనిపించే మానవ ఆశ్రయం లేకుండా, గుహ ప్రార్థన దేవుడిని భాగంగా పేర్కొని కృతజ్ఞతా సమాజంలోకి విడుదలను ఆశిస్తుంది.
ఒంటరితనంఆశ్రయంఫిర్యాదురక్షణ
1నేను గొంతెత్తి యెహోవాకు ఆక్రందన చేస్తున్నాను; దయ కోసం యెహోవాకు కంఠమెత్తి ప్రాధేయపడుతున్నాను.
2ఆయన ఎదుట నా ఫిర్యాదు వెల్లడి చేసుకుంటాను; నా కష్టాల గురించి ఆయనకు చెప్పుకుంటాను.
3నా ఆత్మ నాలో సొమ్మసిల్లినప్పుడు మీరే నా నడకను చూస్తారు. నేను నడచే దారిలో, శత్రువులు రహస్యంగా ఉచ్చులు ఉంచారు.
4చూడండి, నా కుడివైపు ఎవరు లేరు; ఎవరు నా గురించి పట్టించుకోరు నాకు ఆశ్రయం లేదు; ఒక్కరైన నాపై దయ చూపించరు.
5యెహోవా, మీకు మొరపెట్టుకుంటున్నాను; “నా ఆశ్రయం మీరే, సజీవుల దేశంలో నా స్వాస్థ్యం మీరే” అని నేనంటాను.
6నేను చాలా క్రుంగిపోయాను, నా మొరను ఆలకించండి. నన్ను వెంటాడే వారి నుండి రక్షించండి, వారు నాకంటే బలంగా ఉన్నారు.
7నేను మీ నామాన్ని స్తుతించేలా, చెరసాలలో నుండి నన్ను విడిపించండి. అప్పుడు మీరు చేసిన ఉపకారం చూసి, నీతిమంతులు నా చుట్టూరా చేరతారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.