
కీర్తనలు 141
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 141 ప్రార్థనను క్రమశిక్షణ గల వ్యక్తిత్వంతో జతచేస్తుంది. లేచే ధూపం ఆరాధనను సూచిస్తుంది, కాచుకున్న మాట, నిగ్రహించిన కోరిక, స్వాగతించిన సరిదిద్దడం, దాగిన ఉరుల నుండి తప్పించుకోవడం ఒత్తిడి కింద విశ్వసనీయంగా ఉండాలనే కోరికను వ్యక్తపరుస్తాయి.
ప్రార్థనమాటలుక్రమశిక్షణసరిదిద్దడం
1యెహోవా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, నా దగ్గరకు త్వరగా రండి; నా స్వరాన్ని ఆలకించండి.
2నా ప్రార్థన దూపమువలే మీకు అంగీకారమగును గాక; నా చేతులు పైకెత్తడం సాయంకాల నైవేద్యంలా ఉండును గాక.
3యెహోవా నా నోటికి కావలి పెట్టండి; నా పెదవులు వాకిట కావలి ఉంచండి.
4కీడు చేసేవారితో కలిసి వారి దుష్ట క్రియలలో నేను పాల్గొనకుండునట్లు, నా హృదయాన్ని చెడు వైపు తిరగనివ్వకండి; వారి రుచిగల పదార్థాలు నేను తినకుండ ఉండనివ్వండి!
5నీతిమంతులు నన్ను కొట్టడం నామీద దయ చూపడమే; వారు నన్ను మందలించడం నాకు తైలాభిషేకమే. నా తల దానిని నిరాకరించదు, కీడుచేసేవారి క్రియలకు విరుద్ధంగా నా ప్రార్థన మాత్రం మానను.
6వారి పాలకులు కొండలపై నుండి పడద్రోయబడతారు, అప్పుడు వారు నా మాటలు నిజమని గ్రహిస్తారు.
7“ఒకరు భూమిలో దున్నినట్లు, మా ఎముకలు మృత్యులోక ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి” అని వారంటారు.
8ప్రభువైన యెహోవా, మీ వైపే నేను చూస్తున్నాను; మీయందు నేను ఆశ్రయించాను; నన్ను మరణానికి అప్పగించకండి.
9కీడుచేసేవారి ఉచ్చుల నుండి, వారు నా కోసం వేసిన వల నుండి నన్ను క్షేమంగా ఉంచండి.
10దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు, నేనైతే తప్పించుకు వెళ్తాను.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.