Three generations share a courtyard meal beneath grapes and olives overlooking peaceful Jerusalem

కీర్తనలు 128

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
అర్థవంతమైన శ్రమ, వర్ధిల్లుతున్న వివాహం, ఒలీవ మొలకల్లాంటి పిల్లలు, దీర్ఘ జీవితం, యెరూషలేము శాంతి ద్వారా ఆశీర్వాదాన్ని కీర్తన 128 చిత్రిస్తుంది. ప్రైవేటు కుటుంబ సంతోషం సహజంగా మొత్తం ఒడంబడిక సమాజం పట్ల శ్రద్ధగా విస్తరిస్తుంది.
కుటుంబంశ్రమఆశీర్వాదంశాంతి
1యెహోవా పట్ల భయం కలిగి, ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.
2మీరు మీ కష్టార్జితాన్ని తింటారు; ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.
3మీ ఇంట్లో మీ భార్య ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది; మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు.
4యెహోవా పట్ల భయం కలవారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు.
5సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు; మీ జీవితకాలమంతా యెరూషలేము అభివృద్ధిని చూస్తారు.
6మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.