An elder shows healed scars to younger listeners beside cut ropes as former oppressors leave

కీర్తనలు 129

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఇశ్రాయేలు యవ్వనం నుండి పదే పదే అణచివేతను చివరి మాటగా అనుమతించకుండా కీర్తన 129 గుర్తుచేసుకుంటుంది. లోతైన గాయాలు కనిపిస్తూనే ఉంటాయి, కానీ బంధించే తాళ్లు తెగిపోతాయి, దోపిడీ చేసేవారు కప్పు మీద ఉన్న గడ్డిలా తాత్కాలికంగా మారతారు.
అణచివేతమనుగడన్యాయంస్వేచ్ఛ
1“నా యవ్వనకాలం నుండి పగవారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు” అని ఇశ్రాయేలు అనాలి;
2“నా యవ్వనకాలం నుండి వారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు, కాని వారు నాపై విజయాన్ని పొందలేరు.
3దున్నువారు దున్నినట్లు నా వీపుపై పొడవైన చాళ్ళలాంటి గాయాలు చేశారు.
4అయితే యెహోవా నీతిమంతుడు; దుష్టులు కట్టిన తాళ్లను తెంచి ఆయన నన్ను విడిపించారు.”
5సీయోనును ద్వేషించే వారందరు సిగ్గుపడి వెనుకకు తిరుగుదురు గాక.
6వారు ఎదగక ముందే ఎండిపోయిన ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా అవుదురు గాక.
7దానితో కోత కోసేవారు తమ చేతిని గాని పనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు.
8“యెహోవా ఆశీర్వాదం మీమీద ఉండును గాక; యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని బాటసారులు అనకుందురు గాక.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.