A family embraces children at a building site while workers and city watchmen pause to pray

కీర్తనలు 127

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కట్టడంలో, కాపలా కాయడంలో, పనిలో, కుటుంబాన్ని పెంచడంలో ఆందోళనతో కూడిన స్వీయ ఆధారపడటాన్ని కీర్తన 127 సవాలు చేస్తుంది. మానవ ప్రయత్నం ముఖ్యమే, కానీ నిలకడైన భద్రత, వారసత్వం అలసట గల శ్రమ ద్వారా సాధించినవి కాకుండా పొందిన బహుమతులు.
కుటుంబంశ్రమపిల్లలునమ్మకం
1యెహోవా ఇల్లు కడితేనే తప్ప దానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతే దాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే.
2మీరు ప్రొద్దున్నే లేచి ఆలస్యంగా పడుకొంటూ, కష్టపడి పని చేస్తూ ఆహారం తినడం వ్యర్థమే. ఆయన ప్రేమించేవారు నిద్రిస్తునప్పుడు కూడా యెహోవా సమకూరుస్తారు.
3పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.
4యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు వీరుని చేతిలో బాణాలవంటివారు.
5వారితో తన అంబులపొదిని నింపుకున్నవాడు ధన్యుడు. గుమ్మంలో తమ విరోధులను ఎదుర్కొన్నప్పుడు వారు అవమానం పొందరు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.