A tearful farmer sows near restored Jerusalem as joyful families return carrying abundant grain

కీర్తనలు 126

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కలలా అనిపించేంత ఆశ్చర్యకరమైన పునరుద్ధరణను కీర్తన 126 గుర్తుచేసుకుంటుంది. తిరిగి రావడంతో నవ్వు, అంతర్జాతీయ సాక్ష్యం వస్తాయి, నూతన ప్రార్థన ప్రస్తుత కన్నీళ్లు, ఖర్చుతో కూడిన విత్తనాలు పాటలు, సమృద్ధ పంటగా మారతాయని నమ్ముతుంది.
పునరుద్ధరణసంతోషంకన్నీళ్లుపంట
1యెహోవా సీయోను భాగ్యాలను పునరుద్ధరించినప్పుడు, మనం కలలుగన్న వారిలా ఉన్నాము.
2మన నోరు నవ్వుతో నింపబడింది, మన నాలుకలు సంతోషగానాలతో నిండి ఉన్నాయి. “యెహోవా వీరి కోసం గొప్పకార్యాలు చేశారు” అని ఇతర దేశాలు చెప్పుకున్నాయి.
3యెహోవా మన కోసం గొప్పకార్యాలు చేశారు, మనం ఆనందభరితులం అయ్యాము.
4దక్షిణ దేశంలో ప్రవాహాలు ప్రవహించేలా, యెహోవా, మా భాగ్యాలను తిరిగి రప్పించండి.
5కన్నీటితో విత్తేవారు సంతోషగానాలతో పంట కోస్తారు.
6విత్తనాలను పట్టుకుని, ఏడుస్తూ విత్తడానికి వెళ్లినవారు, సంతోషగానాలతో పనలు మోసుకువస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.