
కీర్తనలు 125
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
నమ్మకమైన ప్రజలను కదలని సీయోను పర్వతంతో, చుట్టూ ఉన్న రక్షణను యెరూషలేము పర్వతాలతో కీర్తన 125 పోలుస్తుంది. అణచివేత పాలన శాశ్వతంగా ఉండదు; నిజాయితీ ప్రోత్సహించబడుతుంది, వంకర మార్గాలు తిరస్కరించబడతాయి, శాంతి ప్రార్థనను ముగిస్తుంది.
సీయోనుస్థిరత్వంరక్షణశాంతి
1యెహోవాపై నమ్మకము ఉంచేవారు కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.
2యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు, ఇప్పుడు ఎల్లప్పుడు యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు.
3నీతిమంతులకు కేటాయించబడిన భూమి మీద దుష్టుల రాజదండం మీద నిలిచి ఉండదు, లేకపోతే నీతిమంతులు పాపం చేయడానికి తమ చేతులను ఉపయోగిస్తారు.
4యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి.
5అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని దుష్టులతో పాటు బహిష్కరిస్తారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.