
కీర్తనలు 124
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
దైవిక సహాయం లేకుండా ఏమి జరిగేదో కీర్తన 124 ఊహిస్తుంది: శత్రువులు, కోపం, వరద, దంతాలు ప్రజలను మింగివేసేవి. బదులుగా, ఎర తెగిన ఉరి నుండి తప్పించుకుని, కృతజ్ఞతతో తన రక్షకుని పేరు పెడుతుంది.
తప్పించుకోవడంసహాయంప్రమాదంకృతజ్ఞత
1మనుష్యులు మనపై దాడి చేసినప్పుడు వారి కోపం మనపై రగులుకొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే వారు మనల్ని సజీవంగానే మ్రింగివేసేవారు; వరద మన మీదుగా పొర్లి ఉండేది, జలప్రవాహం మనల్ని ముంచేసి జలప్రవాహాల పొంగు మనల్ని తుడిచిపెట్టి ఉండేది అని ఇశ్రాయేలు చెప్పును గాక.
6వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించని యెహోవాకు స్తుతి చెల్లును గాక.
7వేటగాని ఉరి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా మనం తప్పించుకున్నాము; ఉరి తెగిపోయింది, మనం తప్పించుకున్నాము.
8భూమ్యాకాశాలను సృజించిన యెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.