
కీర్తనలు 123
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యజమాని చేతిని చూస్తున్న సేవకుల కేంద్రీకృత శ్రద్ధతో కీర్తన 123 పైకి తిరుగుతుంది. ఎగతాళి, గర్విష్ఠ తిరస్కారంతో నిండిన అలసిన సమాజం వినయంగా, శ్రద్ధగా, పట్టుదలతో అవసరమైన దయ కోసం వేచి ఉంటుంది.
దయఆధారపడటంతిరస్కారంప్రార్థన
1పరలోకంలో సింహాసనాసీనుడైన దేవా, మీ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను.
2దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు, దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు, మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకు మన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి.
3మాపై దయచూపండి, యెహోవా, మాపై దయచూపండి, ఎందుకంటే మేము అంతులేని ధిక్కారాన్ని భరించాము.
4మేము గర్విష్ఠుల అంతులేని ఎగతాళిని, అహంకారుల ధిక్కారాన్ని భరించాము.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.