Joyful travelers enter Jerusalem as elders judge fairly at the gate and families greet one another

కీర్తనలు 122

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
గోత్రాలు ఆరాధించి న్యాయం నిర్వహించబడే కుదింపబడిన నగరమైన యెరూషలేములోకి చేరుకోవడాన్ని కీర్తన 122 కొనియాడుతుంది. సమాజం పట్ల ప్రేమ శాంతి, భద్రత, వర్ధిల్లుతున్న కుటుంబాలు, పవిత్ర స్థల మేలు కోసం ప్రార్థనగా మారుతుంది.
యెరూషలేముశాంతిఆరాధనన్యాయం
1“యెహోవా ఆలయానికి వెళ్దాం” అని నాతో అన్న వారితో నేను సంతోషించాను.
2ఓ యెరూషలేమా, మీ గుమ్మాల్లో మా పాదాలు నిలిచి ఉన్నాయి.
3యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణము; అది దగ్గరగా కుదించబడింది.
4ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన శాసనం ప్రకారం యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారి గోత్రాలు అనగా యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కి వెళ్తాయి.
5అక్కడ తీర్పు కొరకైన సింహాసనాలు ఉన్నాయి, అవి దావీదు ఇంటివారి సింహాసనాలు.
6యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థించండి. “యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు క్షేమంగా ఉందురు గాక!
7మీ ప్రాకారాలలో సమాధానం మీ కోట గోడలలో అభివృద్ధి ఉండును గాక!”
8నా సోదరులు నా స్నేహితుల కోసం “మీలో సమాధానం ఉండును గాక” అని నేను అంటాను.
9మన దేవుడైన యెహోవా మందిరం కోసం మీ వృద్ధిని నేను కోరతాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.