
కీర్తనలు 121
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 121 ఎన్నడూ నిద్రపోని సృష్టికర్త, సంరక్షకుని వైపు పర్వతాలకు అతీతంగా యాత్రికుని కళ్లను లేపుతుంది. నీడ, జాగ్రత్తగా చూసే సన్నిధి, సమగ్ర రక్షణ ప్రతి అడుగు, బయలుదేరడం, తిరిగి రావడంలో ఇప్పుడు, భవిష్యత్తులో తోడుగా ఉంటాయి.
రక్షణయాత్రనమ్మకంసంరక్షకుడు
1కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది?
2ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది.
3ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, నిన్ను కాపాడేవాడు కునుకడు.
4నిజానికి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కునుకడు న్రిదపోడు.
5యెహోవా నిన్ను కాపాడతారు, యెహోవా మీ కుడి వైపున మీకు నీడగా ఉంటారు.
6పగటివేళ సూర్యుడు కాని లేదా, రాత్రివేళ చంద్రుడు కాని మీకు హాని చేయరు.
7సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు.
8ఇప్పటినుండి నిరంతరం నీ రాకపోకలలో యెహోవా నిన్ను కాపాడును.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.