A peace-seeking man raises an open hand between armed desert archers and deceitful negotiators

కీర్తనలు 120

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
అబద్ధపు పెదవులు, వినాశకర మాటల గురించి బాధతో కీర్తన 120 యాత్రా గీతాలను ప్రారంభిస్తుంది. శాంతికి దూరంగా జీవిస్తూ, మాట్లాడేవాడు శాంతియుత ఉద్దేశాలకు యుద్ధంతో జవాబిచ్చే పొరుగువారి మధ్య సత్యం, సామరస్యం కోసం ఆరాటపడతాడు.
సత్యంశాంతివేదనయాత్ర
1నా బాధలో యెహోవాకు మొరపెడతాను, ఆయన నాకు జవాబిస్తారు.
2యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నన్ను రక్షించండి.
3ఓ మోసకరమైన నాలుకా, దేవుడు నీకేం చేస్తారు? ఆయన ఇంతకన్నా ఎక్కువగా నీకేం చేస్తారు?
4వీరుల పదునైన బాణాలతో, మండుతున్న బదరీ మొక్కల నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తారు.
5నేను మెషెకులో నివసించినందుకు, కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ!
6సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో చాలా కాలం నివసించాను.
7నేను సమాధానం కోరుతున్నాను; కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.