Families cross between receding waters as mountains rise and fresh water pours from rock

కీర్తనలు 114

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
నిర్గమనం, భూమిలోకి ప్రవేశాన్ని కీర్తన 114 స్పష్టమైన సృష్టి స్పందనగా కుదిస్తుంది. సముద్రం, యొర్దాను వెనుదిరుగుతాయి, పర్వతాలు గంతులు వేస్తాయి, బానిసలైన ప్రజలను పవిత్ర స్థలంగా మార్చే సన్నిధి ముందు రాయి నీరుగా మారుతుంది.
నిర్గమనంసృష్టివిముక్తిసన్నిధి
1ఇశ్రాయేలు ఈజిప్టు నుండి, యాకోబు పర భాష మాట్లాడే ప్రజలమధ్య నుండి బయటకు వచ్చాక,
2యూదా దేవునికి పరిశుద్ధాలయం అయ్యింది, ఇశ్రాయేలు ఆయన రాజ్యమైంది.
3అది చూసి ఎర్ర సముద్రం పారిపోయింది, యొర్దాను వెనుకకు తిరిగింది;
4పర్వతాలు పొట్టేళ్లలా, కొండలు గొర్రెపిల్లల్లా గంతులేశాయి.
5సముద్రమా, నీవెందుకు పారిపోయావు? యొర్దాను, నీవెందుకు వెనుకకు తిరిగావు?
6పర్వతాల్లారా, మీరు పొట్టేళ్లలా, కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లా ఎందుకు గంతులేశారు?
7ఓ భూమి, ప్రభువు సన్నిధిలో యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి.
8ఆయన బండను నీటి ఊటగా మార్చేవారు, చెకుముకి రాతిని నీటి బుగ్గగా మార్చేవారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.