Anxious wealthy patrons sit among mute metal idols while families serve one another outside

కీర్తనలు 115

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
మానవ సమాజాలకు మహిమను తిరస్కరిస్తూ కీర్తన 115 చేతితో చేసిన విగ్రహాలను ఆకట్టుకునేవిగా కానీ ప్రాణం లేనివిగా బయటపెడుతుంది. ఇశ్రాయేలు, యాజకులు, దేవుడిని గౌరవించే వారందరూ సహాయం, ఆశీర్వాదం, రక్షణ యొక్క జీవిత మూలాన్ని నమ్మమని పిలవబడతారు.
విగ్రహారాధననమ్మకంఆశీర్వాదంసమాజం
1మాకు కాదు, యెహోవా, మాకు కాదు, మీ మారని ప్రేమ, నమ్మకత్వాన్ని బట్టి, మీ నామానికే మహిమ కలగాలి.
2“వారి దేవుడు ఎక్కడ?” అని జనులు ఎందుకు అంటున్నారు?
3మన దేవుడు పరలోకంలో ఉన్నారు; ఆయనకు ఇష్టమైనదే ఆయన చేస్తారు.
4అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు.
5వాటికి నోళ్ళున్నాయి, కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి, కాని చూడలేవు.
6వాటికి చెవులున్నాయి, కాని వినలేవు, ముక్కులున్నాయి, కాని వాసన చూడలేవు.
7వారికి చేతులు ఉన్నాయి, కానీ అనుభూతి చెందవు, పాదాలున్నాయి, కాని నడవలేవు, కనీసం వాటి గొంతులతో శబ్దం చేయలేవు.
8వాటిని తయారుచేసేవారు, వాటిని నమ్మేవారు వాటి లాగే ఉంటారు.
9సర్వ ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.
10అహరోను వంశమా, యెహోవాను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.
11యెహోవాకు భయపడు వారలారా ఆయనను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.
12యెహోవా మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు మనల్ని దీవిస్తారు: ఆయన ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తారు, అహరోను వంశాన్ని దీవిస్తారు.
13యెహోవాకు భయపడేవారిని అనగా పిల్లలను పెద్దలను ఆయన దీవిస్తారు.
14యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను, వృద్ధి చేయును గాక.
15ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవాచేత, మీరు దీవించబడుదురు గాక.
16ఎత్తైన ఆకాశాలు యెహోవాకు చెందినవి, అయితే భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చారు.
17యెహోవాను స్తుతించేది చనిపోయినవారు కాదు, నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లేవారు కాదు;
18మనమే యెహోవాను కీర్తించేవారం, ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము. యెహోవాను స్తుతించండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.