A new mother embraces her baby while neighbors honor poor families at a sunrise celebration

కీర్తనలు 113

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, పరలోక ఎత్తుల నుండి సమాజంలోని అత్యంత తక్కువ స్థానాల వరకు కీర్తన 113 స్తుతిని విస్తరిస్తుంది. పేదవారు గౌరవాన్ని పొందుతారు, పేదవారు గౌరవప్రద సాంగత్యాన్ని పంచుకుంటారు, పిల్లలు లేని స్త్రీ కుటుంబంలో సంతోషిస్తుంది.
స్తుతిగౌరవంపేదలుకుటుంబం
1యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి; యెహోవా నామాన్ని స్తుతించండి.
2ఇప్పుడు ఎల్లప్పుడు సదా యెహోవా నామం స్తుతింపబడును గాక.
3సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు, యెహోవా నామం స్తుతింపబడును గాక.
4దేశాలన్నిటికి పైగా యెహోవా హెచ్చింపబడ్డారు, ఆయన మహిమ ఆకాశాలకు పైగా విస్తరించి ఉంది.
5మన దేవుడైన యెహోవా లాంటి వారెవరు, ఎత్తైన సింహాసనంపై ఆసీనులై ఉన్నవారు,
6అక్కడినుండి ఆకాశాన్ని, భూమిని వంగి చూడగలవారెవరు?
7దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే;
8ఆయన వారిని రాకుమారులతో, తన ప్రజల రాకుమారులతో కూర్చోబెడతారు.
9అతడు సంతానం లేని స్త్రీని తన ఇంట్లో సంతోషంగా ఉన్న తల్లిగా స్థిరపరుస్తారు. యెహోవాను స్తుతించండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.