
యోబు 25
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
బిల్దదు దేవుని ఆధిపత్యం, ఎత్తులలో శాంతి స్థాపించబడిన పరలోక లెక్కలేని సైన్యాల గురించి చిన్న చివరి ప్రసంగం ఇస్తాడు. చంద్రుడు, నక్షత్రాలు కూడా దేవుని దృష్టిలో శుద్ధంగా లేకపోతే, స్త్రీ నుండి పుట్టిన పురుగు వంటి మనిషి ఎలా నీతిమంతుడు కాగలడని అడుగుతాడు.
బిల్దదుదైవిక ఆధిపత్యంమానవ బలహీనతవిశ్వం
1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు:
2“అధికారం భీకరత్వం దేవునివే; ఉన్నత స్థలాల్లో సమాధానాన్ని కలుగజేస్తారు.
3ఆయన సైన్యాలు లెక్కించబడగలవా? ఎవరి మీద ఆయన వెలుగు ఉదయించదు?
4అలాంటప్పుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు కాగలడు? అలాంటప్పుడు స్త్రీకి పుట్టిన ఒకడు ఎలా పవిత్రుడు కాగలడు?
5ఒకవేళ దేవుని దృష్టిలో చంద్రుడు కాంతివంతుడు కానప్పుడు; నక్షత్రాలు పవిత్రమైనవి కానప్పుడు.
6పురుగువంటి మనుష్యుడు క్రిమివంటి మనుష్యుడు ఆయన దృష్టిలో పవిత్రుడు కాలేడు కదా!”
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.