
3 యోహాను పత్రిక 1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
సత్యంలో నడవడం, ప్రయాణిస్తున్న విశ్వాసులకు ఉదారంగా మద్దతు ఇచ్చినందుకు పెద్ద గాయును మెచ్చుకుంటాడు. ఆధిక్యతను కోరి ఇతరులను తిరస్కరించే దియొత్రెఫే ప్రతికూల విరుద్ధతను అందిస్తాడు, దేమేత్రి అనుకరణకు అర్హమైన మంచి సాక్ష్యాన్ని పొందుతాడు.
ఆతిథ్యంసత్యంసేవక నాయకత్వంమంచి సాక్ష్యం
1పెద్దనైన నేను, సత్యంలో ప్రేమించుచున్న నా ప్రియ స్నేహితుడైన గాయికు వ్రాయునది:
2ప్రియ మిత్రుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు, మంచి ఆరోగ్యాన్ని కలిగి అన్నిటిలో నీవు వర్ధల్లాలని నేను ప్రార్థిస్తున్నాను.
3కొందరు విశ్వాసులు వచ్చి నీవు సత్యంలో ఎలా జీవిస్తున్నావో చెప్తూ, మీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యమిచ్చినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది.
4నా పిల్లలు సత్యంలో జీవిస్తున్నారని వినడంకంటే నాకు సంతోషకరమైన విషయం వేరొకటి లేదు.
5ప్రియ మిత్రుడా, నీకు పరిచయం లేని సహోదరి సహోదరుల కోసం నీవు చేస్తున్నదాంట్లో నమ్మకంగా ఉన్నావు.
6నీ ప్రేమ గురించి వారు సంఘానికి చెప్పారు. దయచేసి దేవుని ఘనపరచే విధంగా వారిని వారి మార్గంలో పంపు.
7దేవుని ఎరుగనివారి నుండి ఏమి తీసుకోకుండా ఆయన నామం నిమిత్తం వారు బయలుదేరారు.
8మనం సత్యం కోసం కలిసి పని చేసేలా అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి.
9నేను సంఘానికి వ్రాశాను, కాని మొదటి స్థానాన్ని ఆశించే దియొత్రెఫే మమ్మల్ని చేర్చుకోవడంలేదు.
10కాబట్టి నేను వచ్చినపుడు అతడు చేస్తున్న వాటిని వివరిస్తాను. అతడు మా గురించి అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాడు. దానితో తృప్తి చెందకుండా, ఇతర విశ్వాసులను చేర్చుకోవడానికి కూడా అంగీకరించడం లేదు. చేర్చుకోవాలనుకునే వారిని కూడ అతడు ఆపివేసి, వారిని సంఘం నుండి వెళ్లగొడుతున్నాడు.
11ప్రియ మిత్రుడా, చెడును కాక మంచిని మాత్రమే అనుసరించు. మంచి చేసేవారు దేవునికి చెందినవారు. చెడు చేసేవారు దేవుని చూడలేరు.
12దేమేత్రిని గురించి అందరు మంచిగా చెప్తున్నారు. సత్యం విషయంలో కూడ మంచి సాక్ష్యం ఉంది. మా సాక్ష్యం సత్యమని నీకు తెలుసు.
13నేను నీకు వ్రాయవలసినది ఎంతో ఉంది. కాని కలంతో సిరాతో వ్రాయాలని నాకు లేదు.
14త్వరలో నేను నీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా నీతో మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.
15నీకు సమాధానం కలుగును గాక. ఇక్కడ ఉన్న స్నేహితులు వారి శుభాలను పంపుతున్నారు. అక్కడ ఉన్న స్నేహితులందరికి పేరుపేరున శుభాలు తెలియజేయి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.