A household warmly welcoming one messenger while courteously refusing a misleading traveler at the gate

2 యోహాను పత్రిక 1

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఎంపిక చేయబడిన గృహ సభ్యులు సత్యంలో నడుస్తున్నందుకు పెద్ద సంతోషించి ఒకరినొకరు ప్రేమించమనే ఆజ్ఞను పునరావృతం చేస్తాడు. మోసగాళ్లు క్రీస్తు శరీరధారణను తిరస్కరిస్తారు కాబట్టి, విశ్వసనీయ ప్రేమ బోధన, ఆతిథ్యం గురించి వివేచనను చేర్చాలి.
సత్యంప్రేమవిధేయతవివేచన
1పెద్దనైన నేను, దేవుని చేత ఏర్పరచబడిన అమ్మగారికి, ఆమె పిల్లలకు వ్రాయునది: సత్యంలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మాత్రమే కాదు, సత్యాన్ని ఎరిగిన వారందరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
2మనలో నివసిస్తున్న, నిత్యం మనతోనే ఉండే సత్యాన్ని బట్టి వారు ప్రేమిస్తున్నారు.
3సత్యంలోను ప్రేమలోను తండ్రియైన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి మనకు కృపా కనికరం సమాధానాలు మనతో ఉంటాయి.
4తండ్రి మనకు ఆజ్ఞాపించిన విధంగా నీ బిడ్డలలో కొందరు సత్యంలో జీవించడం చూసి ఎంతో సంతోషించాను.
5అమ్మా, నేను నీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు కాని ఇది మొదటి నుండి మనకు ఉన్న ఆజ్ఞను బట్టి మనం ఒకరినొకరం ప్రేమించాలని అడుగుతున్నాను.
6ప్రేమ అంటే మనం దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే. మొదటి నుండి మీరు వింటున్నట్లుగా మీరందరు ప్రేమలో జీవించాలి అనేదే ఆయన ఇచ్చిన ఆజ్ఞ.
7ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు మనుష్యునిగా వచ్చారని ఒప్పుకొనని మోసగాళ్లు చాలామంది లోకంలో బయలుదేరారు. వారు క్రీస్తు విరోధులు.
8మనం ఇంతవరకు దేనికోసం పని చేశామో దానిని కోల్పోకుండా మీ బహుమానాన్ని సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త వహించండి.
9క్రీస్తు బోధలో కొనసాగకుండా దానిని విడిచి ముందుకు వెళ్లే వారికి దేవుడు లేడు; కాని బోధలో కొనసాగేవారు తండ్రిని, కుమారుని ఇరువురిని కలిగి ఉంటారు.
10ఎవరైనా ఈ బోధను తీసుకురాకుండా మీ దగ్గరకు వస్తే, వారిని మీ ఇంట్లోకి తీసుకెళ్లవద్దు రమ్మనవద్దు.
11వారిని రమ్మని ఆహ్వానించేవారు వారి చెడుపనులలో భాగం పంచుకొంటారు.
12మీకు చాలా సంగతులు వ్రాయవలసి ఉంది, కాని సిరాతో కాగితంతో వ్రాయడం ఇష్టం లేదు. మన సంతోషం సంపూర్ణం కావడానికి, నేను మీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.
13దేవుని చేత ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనాలు చెప్తున్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.