
పరమ 8
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
స్త్రీ బహిరంగంగా గౌరవించదగిన ప్రేమను కోరుకుని హృదయం, చేతిపై ముద్రగా ఉంచమని అడుగుతుంది. ప్రేమ ఉగ్రమైనది, వరదలచే ఆర్పలేనిది, కొనలేనిది. పరిపక్వత, ద్రాక్షతోటల ప్రశ్నలు వ్యక్తిగత అధికారం, శ్రద్ధగల సాంగత్యం, ప్రియుడికి చివరి పిలుపుగా పరిష్కరించబడతాయి.
ఒడంబడిక ప్రేమబలంవిశ్వసనీయతవ్యక్తిగత అధికారంఆరాటం
1ఒకవేళ నీవు నాకు సోదరుడిలా ఉంటే, నా తల్లి స్తనముల దగ్గర పెంచబడిన వాడవైయుంటే! అప్పుడు, నేను నిన్ను బయట కనుగొని ఉంటే, నిన్ను ముద్దాడేదాన్ని, నన్ను ఎవరూ నిందించేవారు కారు.
2నేను నిన్ను తోలుకొని నాకు ఉపదేశం చేసిన, నా తల్లి ఇంటికి తీసుకెళ్లేదాన్ని. నీవు త్రాగడానికి నీకు సుగంధద్రవ్యాలు కలిపిన ద్రాక్షరసాన్ని, దానిమ్మపండ్ల మకరందం ఇచ్చేదాన్ని.
3ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉంచాడు, కుడిచేతితో నన్ను కౌగిలించుకున్నాడు.
4యెరూషలేము కుమార్తెలారా! మీతో ప్రమాణము చేయిస్తున్నాను: సరియైన సమయం వచ్చేవరకు ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.
5తన ప్రియుని ఆనుకుని అరణ్యంలో నుండి నడచి వస్తున్నది ఎవరు? యువకుడు ఆపిల్ చెట్టు క్రింద నేను నిన్ను లేపాను; అక్కడ నీ తల్లి నిన్ను గర్భం దాల్చింది, అక్కడ ప్రసవ వేదనలో ఆమె నీకు జన్మనిచ్చింది.
6నన్ను నీ హృదయం మీద ఒక ముద్రలా, మీ చేతికి రాజ ముద్రలా ఉంచుకో; ఎందుకంటే ప్రేమ మరణంలా బలమైనది, దాని అసూయ సమాధిలా క్రూరమైనది. ఇది మండుతున్న అగ్నిలా, శక్తివంతమైన మంటలా కాలుతుంది.
7పెరుగుతున్న జలాలు ప్రేమను అణచివేయలేవు; నదీజలాలు ప్రేమను తుడిచివేయలేవు. ప్రేమకు ప్రతిగా తనకున్నదంతా ఇచ్చినా, దానికి తిరస్కారమే లభిస్తుంది.
8మాకో చిన్న చెల్లెలుంది, దానికింకా స్తనములు రాలేదు. దానికి పెళ్ళి నిశ్చయమైతే ఏం చేయాలి?
9ఒకవేళ ఆమె ప్రాకారమైతే, ఆమెపై మేము వెండి గోపురం కట్టిస్తాము. ఒకవేళ ఆమె ద్వారం అయితే, దేవదారు పలకలతో దానికి భద్రత ఏర్పరుస్తాము.
10నేను ప్రాకారాన్ని, నా స్తనములు గోపురాల్లాంటివి. అందుకే అతని దృష్టికి క్షేమం పొందదగినదానిగా ఉన్నాను.
11బయల్-హామోను దగ్గర సొలొమోనుకు ద్రాక్షతోట ఉంది; అతడు తన ద్రాక్షతోటను కౌలుకిచ్చాడు. దాని ఫలానికి ఒక్కొక్కడు వెయ్యి వెండి షెకెళ్ళ శిస్తు చెల్లించాలి.
12కాని, నా ద్రాక్షవనం నా స్వాధీనంలోనే ఉంది; సొలొమోను రాజా, నీ వెయ్యి షెకెళ్ళు నీకే చెందుతాయి. వాటిని చూసుకునే వారికి రెండువందలు షెకెళ్ళు గిట్టుతాయి.
13ఉద్యానవనాల్లో నివసించేదానా నీ చెలికత్తెలు నీతో ఉండగా, నీ స్వరం విననివ్వు.
14నా ప్రియుడా, దూరంగా రా, జింకలా, దుప్పిలా పరిమళముల పర్వతాల మీదుగా గంతులు వేస్తూ రా.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.