
పరమ 1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
స్త్రీ తన ప్రియుడి కోసం ఆరాటపడి అతని ప్రేమ, సుగంధం, పేరును కొనియాడుతుంది. ఆమె సూర్యుడు నల్లబరచిన అందం, ద్రాక్షతోట శ్రమ గురించి నిజాయితీగా మాట్లాడి తరువాత మందల మధ్య అతనిని వెతుకుతుంది. ప్రియులు రత్నాలు, పరిమళం, పచ్చని పొలాలు, దేవదారు చిత్రాల కింద ప్రశంసలను పంచుకుంటారు.
ఆరాటంపరస్పర ప్రశంసఅందంద్రాక్షతోటలుచెందిక
1సొలొమోను రచించిన పరమ గీతములు.
2అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకోనివ్వండి, నీ ప్రేమ ద్రాక్షరసం కంటే ఆహ్లాదకరమైనది.
3మీ పరిమళ ద్రవ్యాల సువాసన హృదయానికి ఆనందాన్నిస్తుంది; మీ పేరు పోయబడిన పరిమళం లాంటిది. కాబట్టి యువతులు నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు!
4నన్ను మీతో దూరానికి తీసుకెళ్లండి; త్వరగా! రాజు తన అంతఃపురాల్లోకి నన్ను తీసుకెళ్లనివ్వండి. చెలికత్తెలు నీ విషయం మేము గొప్పగా సంతోషిస్తున్నాము; నీ ప్రేమను ద్రాక్షరసం కన్నా ఎక్కువగా పొగడుతాము. యువతి వారు నిన్ను పొగడడం ఎంత మంచి విషయం!
5యెరూషలేము కుమార్తెలారా, నల్లనిదానను, అయినా నేను సౌందర్యవతిని, కేదారు డేరాలవంటిదానను, సొలొమోను గుడారపు తెరల్లా నేనూ నల్లనిదాన్ని.
6నల్లపిల్ల అని చెప్పి నన్నిలా తేరిచూస్తారేమి? ఎండకు నేను నల్లగా అయ్యాను. నా తల్లి కుమారులకు నా మీద కోపం నన్ను ద్రాక్షతోటను కావలి కాయడానికి పెట్టారు; అందుకే నా సొంత ద్రాక్షతోటను కాయలేక పోయాను.
7నేను ప్రేమిస్తున్నవాడా, నీ గొర్రెల మందను ఎక్కడ మేపుతున్నావో మధ్యాహ్నం మీ మందను విశ్రాంతికి ఎక్కడ ఉంచుతున్నావో చెప్పు. మీ స్నేహితుల మందల ప్రక్కన నేను ముసుగు వేసుకున్న స్త్రీలా ఎందుకు ఉండాలి?
8స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఒకవేళ నీకు తెలియకపోతే, మందల అడుగుజాడలను బట్టి వెళ్లు, కాపరుల డేరాల ప్రక్కన నీ మేక పిల్లలను మేపుకో.
9నా ప్రియురాలా, నీవు అద్భుతం నీవు ఫరో రథం యొక్క గుర్రాల్లా ఉన్నావు.
10మీ బుగ్గలు చెవిపోగులతో, నీ మెడ హారాలతో అందంగా ఉన్నాయి.
11బంగారు చెవిపోగులు చేస్తాము వెండి పూసలతో అలంకరిస్తాము.
12రాజు బల్ల దగ్గర కూర్చుని ఉన్నాడు, నా పరిమళపు సువాసన అంతా గుబాళించింది.
13నా ప్రియుడు నా స్తనముల మధ్య ఉన్న, బోళం సంచిలా ఉన్నాడు.
14ఎన్-గేదీ ద్రాక్షవనంలో వికసించిన గోరింట పూలగుత్తి లాంటివాడు నా ప్రియుడు.
15నా ప్రియురాలా, నీవు ఎంత అందమైనదానవు! ఓ, ఎంతో అందాలరాశివి! నీ కళ్లు గువ్వలు.
16నా ప్రియుడా! నీవు ఎంత సౌందర్యమూర్తివి! ఓ, నీవు ఎంతో అందమైనవాడవు! మనకు పడక ప్రశాంతము.
17మన గృహం దేవదారు దూలాలు! మన వాసాలు సరళవృక్షాల మ్రానులు.
‹ ప్రసంగి 12పరమ 2 ›
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.