A reunited couple standing in a garden of lilies and pomegranates at sunrise

పరమ 6

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
తన ప్రియుడు తోటకు వెళ్లాడని స్త్రీకి తెలుసు, ఆమె వారి పరస్పర చెందికను ధృవీకరిస్తుంది. అతను రాణులు, యువతుల మధ్య ఆమె అందం, ప్రత్యేకత, ఆధిపత్య తేజస్సును కొనియాడుతాడు. తోట, ఉదయం, చంద్రుడు, సూర్యుడు, జెండాలు, తిరిగి వచ్చిన షూలమ్మీయ స్త్రీ అధ్యాయం నూతన ఆశ్చర్యాన్ని రూపొందిస్తాయి.
పునఃకలయికపరస్పర చెందికప్రత్యేకతతేజస్సుతోట
1స్త్రీలలో అత్యంత అందమైనదానా, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్లాడు? నీ ప్రియుడు ఎటువైపు వెళ్లాడు మేమూ నీతో పాటు ఆయనను వెదకడానికి.
2నా ప్రియుడు తన తోటకు వెళ్లాడు, పరిమళ మొక్కల పాన్పుల దగ్గరకు, తోటలో మందను మేపడానికి, తామరలను ఏరుకోడానికి.
3నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు; తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు.
4నా ప్రియురాలా, నీవు తిర్సా పట్టణంలా అందంగా ఉన్నావు, యెరూషలేములా మనోహరంగా ఉన్నావు, జెండాలు పట్టుకున్న సైన్యంలా గంభీరంగా ఉన్నావు.
5నీ కళ్లను నా వైపు నుండి త్రిప్పు; అవి నన్ను వశపరచుకుంటాయి. నీ శిరోజాలు గిలాదు వంపుల నుండి దిగివస్తున్న మేకల మందల్లా ఉన్నాయి.
6నీ పళ్ళు అప్పుడే కడుగబడి పైకి వస్తున్న గొర్రె మందలా ఉన్నాయి. ప్రతిదీ జంటగా ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు.
7నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు, విచ్చిన ఒక దానిమ్మ పండులా ఉన్నాయి.
8అరవైమంది రాణులు, ఎనభైమంది ఉంపుడుగత్తెలు, అసంఖ్యాకులైన కన్యకలు ఉండవచ్చు;
9కాని నా పావురం, నా అందాలరాశి, ఒకతే, తన తల్లికి ఒక్కగానొక్క కుమార్తె, తనను కన్నదానికి ఇష్టమైనది. యువతులు ఆమెను చూసి ఆమెను ధన్యురాలు అని పిలిచారు; రాణులు ఉంపుడుగత్తెలు ఆమెను ప్రశంసించారు.
10తెల్లవారుజాములా, జాబిల్లిలా అందంగా, సూర్యునిలా ప్రకాశవంతంగా, నక్షత్రాల్లా గంభీరంగా కనిపించే ఈమె ఎవరు?
11లోయలో గుబురుగా పెరిగిన అక్షోట చెట్ల దగ్గరకు లోయలో నూతన చిగురులను చూడాలని, ద్రాక్షచెట్లు చిగిరించాయో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టాయో లేదో చూడాలని వెళ్లాను.
12నేను గ్రహించేలోపే, నా కోరిక నన్ను ప్రజల్లో ఘనత వహించిన వారి రథాలను మధ్య ఉంచింది.
13ఓ షూలమ్మీతీ, వెనుకకు రా, వెనుకకు రా; తనివితీర మేము నిన్ను చూసేలా, వెనుకకు రా, వెనుకకు రా! యువకుడు మహనాయీము నాట్యాన్ని చూసినట్లు మీరు ఎందుకలా షూలమ్మీతిని చూస్తారు?

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.