
కీర్తనలు 95
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 95 రక్షణ బండ వైపు ఉత్సాహభరిత గానంతో, సృష్టికర్త, కాపరి ముందు వినయపూర్వక ఆరాధనతో ప్రారంభమవుతుంది. ఇది అరణ్య హెచ్చరికతో ముగుస్తుంది: కృతజ్ఞతా స్వరాలు వినే, స్పందించే హృదయాలతో కలిసి ఉండాలి.
ఆరాధనకాపరివిధేయతహెచ్చరిక
1రండి! యెహోవాను గురించి ఆనంద గానం చేద్దాం; రక్షణ కొండయైన దేవునికి ఆనంద కేకలు వేద్దాము.
2కృతజ్ఞతార్పణతో ఆయన సన్నిధికి వద్దాం, సంగీత గానంతో ఆయనను కీర్తిద్దాము.
3యెహోవా గొప్ప దేవుడు, దైవములందరి పైన గొప్ప రాజు.
4భూమి యొక్క అగాధాలు ఆయన చేతిలో ఉన్నాయి, పర్వత శిఖరాలు ఆయనకు చెందినవే.
5సముద్రం ఆయనదే, ఆయనే దాన్ని చేశారు, ఆయన హస్తాలు ఆరిన నేలను రూపొందించాయి.
6రండి, సాగిలపడి ఆరాధించుదాం, మన సృష్టికర్తయైన యెహోవాకు మోకరించుదాం;
7ఎందుకంటే ఆయన మన దేవుడు మనం ఆయన పచ్చికలోని ప్రజలం, ఆయన శ్రద్ధచూపే మంద. నేడు, ఆయన స్వరాన్ని ఒకవేళ మీరు వింటే మంచిది,
8“మీరు మెరీబా దగ్గర చేసినట్టుగా, అరణ్యంలో మస్సా దగ్గర చేసినట్టుగా మీ హృదయాలను కఠినం చేసుకోకండి.
9అక్కడ మీ పూర్వికులు నన్ను సందేహించారు; నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా నన్ను పరీక్షించారు.
10నలువది సంవత్సరాలు నేను ఆ తరం వారిపై కోప్పడి ఇలా అన్నాను: ‘వారు హృదయాలు పెడత్రోవ పట్టిన ప్రజలు, వారు నా మార్గాలను తెలుసుకోలేదు’
11కాబట్టి, ‘వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ అని నేను కోపంలో ప్రమాణం చేశాను.”
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.