Immense storm waves crash below a steadfast Jerusalem sanctuary as priests watch from high rock

కీర్తనలు 93

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
గర్జించే సముద్రాల కంటే శక్తివంతమైన మహిమాన్విత పాలనను కీర్తన 93 ప్రకటిస్తుంది. లోకం స్థిరంగా నిలబడుతుంది, పురాతన అధికారం అస్థిరపడదు, నమ్మదగిన శాసనాలు కొనసాగుతాయి, పవిత్రత ఆరాధన నివాస స్థలాన్ని సరిగ్గా గుర్తిస్తుంది.
సర్వాధికారంమహిమస్థిరత్వంపవిత్రత
1యెహోవా పరిపాలిస్తున్నారు, ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నారు; యెహోవా ప్రభావాన్ని వస్త్రంగా బలాన్ని ఆయుధంగా ధరించుకున్నారు; నిజానికి, ప్రపంచం దృఢంగా క్షేమంగా స్థాపించబడింది.
2మీ సింహాసనం ఆది నుండి సుస్థిరమే. అనాది కాలం నుండి మీరున్నారు.
3యెహోవా, నదులలో వరదలు లేచాయి, నదులు ఉరుములా గర్జిస్తున్నాయి, అలలు చెలరేగుతున్నాయి.
4జలప్రవాహాల ఘోష కన్నా బలమైన సముద్ర తరంగాల కన్నా, యెహోవా బలాఢ్యుడై ఉన్నాడు.
5యెహోవా, మీ శాసనాలు స్థిరమైనవి; యెహోవా మీ మందిరం అంతం లేనన్ని దినాలు పరిశుద్ధతతో అలంకరించబడుతుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.