
కీర్తనలు 92
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఉదయం, రాత్రి కృతజ్ఞతలు తెలుపడం మంచిదని కీర్తన 92 ప్రకటిస్తుంది. దుష్టులు క్షణికంగా వర్ధిల్లుతుండగా, నీతిమంతులు పవిత్ర ఆవరణాల్లో నాటిన తాటిచెట్లు, దేవదారు వృక్షాల్లా పెరిగి, ఫలవంతంగా ఉంటూ చెక్కుచెదరని న్యాయాన్ని ప్రకటిస్తారు.
కృతజ్ఞతవిశ్రాంతి దినంవర్ధిల్లడంవిశ్వసనీయత
1యెహోవాను స్తుతించడం మంచిది. మహోన్నతుడా, మీ నామాన్ని కీర్తించడం మంచిది.
2ఉదయకాలం మీ మారని ప్రేమను రాత్రివేళ మీ నమ్మకత్వాన్ని పది తంతుల వీణ సితారా మాధుర్యంతో ప్రకటించడం మంచిది.
4ఎందుకంటే యెహోవా, మీ కార్యముల చేత నాకు సంతోషం కలిగిస్తారు; మీ చేతులు చేసిన వాటిని బట్టి నేను ఆనంద గానం చేస్తాను.
5యెహోవా, మీ క్రియలు ఎంత గొప్పవి, మీ ఆలోచనలు ఎంత గంభీరమైనవి!
6దుష్టులు గడ్డిలా మొలకెత్తినా, కీడుచేసేవారంతా వర్ధిల్లుతున్నా, వారు శాశ్వతంగా నాశనమవుతారని, తెలివిలేనివారికి తెలియదు, మూర్ఖులు గ్రహించరు.
8కాని యెహోవా, మీరు శాశ్వతంగా హెచ్చింపబడి ఉన్నారు.
9యెహోవా, మీ శత్రువులు, నిజంగా మీ శత్రువులు నశిస్తారు; కీడుచేసేవారంతా చెదరిపోతారు.
10మీరు నా కొమ్మును అడవి ఎద్దులా హెచ్చించారు; చక్కని నూనెలు నాపై పోయబడ్డాయి.
11నా విరోధుల ఓటమిని నేను కళ్లారా చూశాను; నా దుష్టుల పూర్తి పరాజయాన్ని నా చెవులారా విన్నాను.
12నీతిమంతులు తాటి చెట్లలా చిగురు పెడతారు, లెబానోనులో వారు దేవదారు చెట్టులా హుందాగా పెరుగుతారు.
13వారు యెహోవా దేవాలయంలో నాటబడి, మన దేవుని ఆవరణాల్లో వర్థిల్లుతారు.
14వారు వృద్ధాప్యంలో కూడా సఫలమైన జీవితంలో సారవంతంగా హాయిగా బ్రతుకుతారు,
15“యెహోవా యథార్థవంతుడు, ఆయన నా కొండ, ఆయనయందు ఏ దుష్టత్వం లేదు” అని వారు ప్రకటిస్తూ ఉంటారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.