
కీర్తనలు 75
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
నియమిత సమయంలో తీర్పు దేవుడికి చెందినది కాబట్టి కీర్తన 75 కృతజ్ఞతలు తెలుపుతుంది. భూమి కంపించినప్పుడు, దాని స్తంభాలు స్థిరంగా ఉంటాయి; గర్విష్ఠ శక్తి హెచ్చరించబడుతుంది, తీర్పు పాత్ర గడిచిపోతుంది, గర్విష్ఠులు తగ్గించబడతారు, నీతిమంతులు లేపబడతారు.
తీర్పువినయంన్యాయంస్తుతి
1దేవా, మేము మిమ్మల్ని స్తుతిస్తాము; మీ పేరు సమీపంగా ఉన్నదని మేము మిమ్మల్ని స్తుతిస్తాం; ప్రజలు మీ అద్భుతమైన కార్యాలను గురించి చెప్పుతారు.
2“నేను నిర్ణీత సమయంలో; న్యాయంగా తీర్పు తీరుస్తాను.
3భూమి దాని ప్రజలంతా భయంతో వణికినప్పుడు, దాని స్తంభాలను గట్టిగా పట్టుకున్నది నేనే. సెలా
4అహంకారులతో అహంకారంగా ఉండవద్దు అని దుష్టులతో, ‘మీ కొమ్ములను ఎత్తకండి.
5ఆకాశం వైపు మీ కొమ్ము ఎత్తకండి; అంత గర్వంగా మాట్లాడకండి’ ” అని మీరంటారు.
6తూర్పు నుండి కాని పడమర నుండి కాని అరణ్యం నుండి కాని ఎవరూ తమను తాము హెచ్చించుకోలేరు.
7దేవుడే తీర్పు తీరుస్తారు: ఆయన ఒకని తగ్గిస్తారు, మరొకని హెచ్చిస్తారు.
8యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది అందులో సుగంధద్రవ్యాలు కలిపిన పొంగుతున్న ద్రాక్షరసం ఉంది; ఆయన దాన్ని బయటకు కుమ్మరిస్తారు, భూమిలోని దుష్టులందరు మడ్డితో సహా దాన్ని త్రాగివేస్తారు.
9నేనైతే నిత్యం ప్రకటిస్తాను; యాకోబు దేవునికి నేను స్తుతి పాడతాను.
10ఎందుకంటే, “దుష్టులందరి కొమ్ములను నేను విరగ్గొడతాను, కాని నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాను” అని ఆయన అంటారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.