
కీర్తనలు 70
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
సహాయం చేయడానికి తొందరపడమని అత్యవసర విజ్ఞప్తిలోకి కీర్తన 70 సంక్షోభాన్ని కుదిస్తుంది. దుర్మార్గ వెంబడించేవారు వెనుదిరగాలని, వెతికేవారు సంతోషించాలని, రక్షణను ప్రేమించే ప్రతి ఒక్కరూ దేవుడిని కొనియాడాలని, పేదవారు ఇంకా విడుదల కోసం వేచి ఉండగా విన్నపదారుడు అడుగుతాడు.
ఆత్యయిక అవసరంవిడుదలవినయంసంతోషం
1దేవా, నన్ను రక్షించడానికి త్వరపడండి; యెహోవా, నాకు సాయం చేయడానికి, త్వరగా రండి.
2నా ప్రాణం తీయాలని కోరేవారు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.
3నన్ను చూసి, “ఆహా! ఆహా!” అని నాతో అనేవారు సిగ్గుపడి ఆశాభంగం పొందాలి.
4అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి.
5కాని నా మట్టుకైతే, నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను; దేవా! నా దగ్గరకు త్వరగా రండి, మీరే నా సహాయం, నా విమోచకుడు; యెహోవా, ఆలస్యం చేయకండి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.