
కీర్తనలు 61
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 61 భూమి అంచుల నుండి మానవ చేరుకు మించిన ఆశ్రయం వైపు మెల్లని మొరను తీసుకువెళుతుంది. కీర్తనకారుడు ఆశ్రయం కోసం అడిగి, సురక్షిత వారసత్వాన్ని గుర్తుచేసుకుని, దేవుని విశ్వసనీయ రక్షణ కింద నిలకడైన స్తుతిని వాగ్దానం చేస్తాడు.
ఆశ్రయంప్రార్థనరక్షణవిశ్వసనీయత
1ఓ దేవా! నా మనవి వినండి; నా ప్రార్థన ఆలకించండి.
2భూదిగంతాలలో నుండి నేను మీకు మొరపెడతాను, నా హృదయం క్రుంగినప్పుడు నేను మొరపెడతాను; నాకన్నా ఎత్తైన కొండ వైపు నన్ను నడిపించండి.
3ఎందుకంటే మీరే నాకు ఆశ్రయం, శత్రువులు చేరుకోలేని ఒక బలమైన గోపురము.
4మీ గుడారంలో చిరకాలం నివసించాలని మీ రెక్కల చాటున ఆశ్రయం పొందాలని నేను ఆశపడుతున్నాను. సెలా
5దేవా! మీరు, నా మ్రొక్కుబడులు విన్నారు; మీ నామానికి భయపడేవారి స్వాస్థ్యం మీరు నాకు ఇచ్చారు.
6రాజు జీవితకాల దినాలను పొడిగించండి, అనేక తరాలకు అతని సంవత్సరాలు తరతరాలకు కొనసాగించండి.
7అతడు శాశ్వతంగా దేవుని సన్నిధిలో సింహాసనాసీనుడై ఉంటారు; మీ మారని ప్రేమ, మీ నమ్మకత్వం అతన్ని కాపాడాలి.
8అప్పుడు నేను ఎడతెగక మీ నామాన్ని బట్టి స్తుతి పాడతాను దినదినం నా మ్రొక్కుబడులు నెరవేరుస్తాను.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.