
కీర్తనలు 6
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 6 శారీరక బలహీనత, భయం, అలసిపోయే కన్నీళ్లకు స్వరం ఇస్తుంది. కీర్తనకారుడు తన మొర వినబడిందని, బెదిరించే వ్యతిరేకత చివరికి వెనుదిరుగుతుందని నమ్మకంతో ఉన్నప్పుడు విలాపం మలుపు తిరుగుతుంది.
విలాపంస్వస్థతకన్నీళ్లునిశ్చయత
1యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి మీ ఉగ్రతలో నన్ను శిక్షించకండి.
2యెహోవా, నేను బలహీనుడను, నాపై దయ చూపండి; యెహోవా, నా ఎముకలు వేదనలో ఉన్నాయి, నన్ను బాగుచేయండి.
3నా ప్రాణం తీవ్ర వేదనలో ఉంది. ఎంతకాలం, యెహోవా, ఇంకెంత కాలం?
4యెహోవా, తిరిగి రండి, నన్ను విడిపించండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను రక్షించండి.
5మృతులు ఉండే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు సమాధి నుండి ఎవరు మీకు స్తుతులు చెల్లిస్తారు?
6మూలుగుతూ నేను అలిసిపోయాను. రాత్రంతా నేను కార్చిన కన్నీటిలో నా పరుపు తడిసిపోతుంది కన్నీటిలో నా మంచం మునిగిపోతుంది.
7విచారంతో నా కళ్లు మసకబారుతున్నాయి. నా శత్రువులందరిని బట్టి అవి క్షీణిస్తున్నాయి.
8యెహోవా నా మొర ఆలకించారు, కాబట్టి చెడు చేసేవారలారా, నా నుండి దూరంగా వెళ్లండి.
9కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు; యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తారు.
10నా శత్రువులందరు సిగ్గుపడి అధిక వేదన పొందుతారు; వారు హఠాత్తుగా సిగ్గుపడి వెనుదిరుగుతారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.